వినాయక చవితి (Vinayaka Chavithi). హిందువులు (Hindus) ఎంతో పవిత్రంగా చేసుకునే ఓ ఉత్సవం. దేవతల్లో ముందుగా పూజలందుకునే వినాయకుడిని భక్తులు(devotes) పారవశ్యంతో పదకొండు రోజుల పాటు కొలుస్తారు. ఊరూ.. వాడా.. గణేశుడి మండపాలతో అంగరంగ వైభవంగా జరుపుతారు. పూజలు, దీప ధూప నైవేద్యాలు ఉంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది ఉత్సవంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది ఆంక్షలున్నా కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో కొన్ని చోట్ల గణేశ్ వేడుకలకు అనుమతిచ్చారు. అందులో కర్నాటక (Karnataka) కూడా ఉంది. కర్నాటకలో గణేశ్ ఉత్సవాల (Ganesh Chaturthi) కు అక్కడి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతించింది. అయితే అక్కడి బెంగళూర్‌లోని కార్పొరేషన్ నూతన నిబంధన సైతం విధించింది. వినాయక చవితి రోజున మాంసంపై నిషేధం (ban on meat) విధించింది.
సెప్టెంబర్ 10న..
కర్నాటకలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని ప్రభుత్వం (government) నడుస్తోంది. అక్కడ రాజధాని నగరం బెంగళూరు (Bangalore). బృహత్ బెంగళూరు మహా నగర పాలిక (BBMP) వినాయక చవితి ఉత్సవాలపై బుధవారం ఆదేశాలు జారీచేసింది. వినాయక చవితి రోజైన సెప్టెంబర్ 10న జంతు వధ (Animal slaughter), మాంసం విక్రయాలపై (Meat selling) నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ(ANI) తన కథనంలో పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర పాలిక సంస్థ హెచ్చరించింది.
మూడు రోజులే..
సెప్టెంబర్ 10 నుంచి నగరంలో మూడు రోజుల గణేశ పూజ వేడుకలను మాత్రమే బహిరంగ ప్రదేశాలలో అనుమతించింది. BBMP చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో గణేశ ఉత్సవాన్ని(Ganesh celebrations) మూడు రోజులకు మించి అనుమతించబోమని, విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు లేదా నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఊరేగింపు ఉండరాదని చెప్పారు.
Karnataka | Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) orders ban on animal slaughter and sale of meat on 10th September-Ganesh Chaturthi
— ANI (@ANI) September 8, 2021
గత సంవత్సరం BBMP మూడు రోజుల పాటు వినాయక ఉత్సవాన్ని అనుమతించిందని, ఈ సంవత్సరం కూడా ఇది కొనసాగుతుందని గౌరవ్ గుప్తా (Gaurav Gupta) చెప్పారు. బహిరంగ వేడుకల్లో పెద్ద సంఖ్యలో సమావేశాలు పాల్గొనే అవకాశం ఉందని నివేదిక అందిన తర్వాత కేవలం మూడు రోజులు మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలపై పెద్ద రగడే నడుస్తోంది. ఏపీలో గణేశుడి ఉత్సవాలపై ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించింది ప్రభుత్వం. దీంతో అక్కడి హిందుత్వ వాదులు ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ నాయకులు టార్గెట్ చేశారు. ఇరు ప్రభుత్వాల తీరుపై ఇప్పటికే చాలామందికి కోర్టుకు కూడా వెళ్లారు. దీనిపై ఏపీ హైకోర్టు కూడా తీర్పునిస్తూ పబ్లిక్ స్థలాల్లో వినాయకుడి విగ్రహాలపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రైవేటు స్థలాల్లో నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవచ్చని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Ganesh Chaturthi 2021, Meat, Vinayaka Chaviti