• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • BENGALURU AUTO DRIVER REWARDED RS 8000 FOR RETURNING BAG CONTAINING RS 2 6 LAKH TO PASSENGER HERE DETAILS NS GH

ఈ ఆటోవాలా అదుర్స్.. ఆటోలో దొరికిన రూ.2.6 లక్షలను తిరిగి ఇచ్చేశాడు.. ఎక్కడంటే?

ఈ ఆటోవాలా అదుర్స్.. ఆటోలో దొరికిన రూ.2.6 లక్షలను తిరిగి ఇచ్చేశాడు.. ఎక్కడంటే?

ప్రతీకాత్మక చిత్రం

Bengaluru: మనుషుల్లో నితీ, నిజాయితీ ఇంకా మిగిలే ఉందని కొన్ని సంఘటనలను చూస్తే అనిపిస్తుంది. డబ్బు కోసం సొంత వారినే చంపేస్తున్న ఈ రోజుల్లో కూడా తన నిజాయితీ చాటుకున్నాడు ఒక ఆటో డ్రైవర్​. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.

  • Share this:
మనుషుల్లో నితీ, నిజాయితీ ఇంకా మిగిలే ఉందని కొన్ని సంఘటనలను చూస్తే అనిపిస్తుంది. డబ్బు కోసం సొంత వారినే చంపేస్తున్న ఈ రోజుల్లో కూడా తన నిజాయితీ చాటుకున్నాడు ఒక ఆటో డ్రైవర్​. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన అమిత్​ కుమార్​ పాండే అనే ఫోటో ఫ్రేమ్ వర్క్స్ చైన్ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. తన ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేయడానికి బెంగళూరు వచ్చాడు. వివిధ దుకాణాల నుండి మొత్తం వసూలైన 2.6 లక్షల నగదును తన బ్యాగులో పెట్టుకొని ఆనందపురకు చెందిన 54 ఏళ్ల కుమార్ ఆటోలో ఎక్కాడు. కాటన్​ పేట వద్ద ఆటో ఎక్కిన అతడు చమరాజ్​ పేటలోని ఈద్గా మైదానం వద్ద దిగిపోయాడు. అయితే, తన బ్యాగును మాత్రం ఆటోలోనే మర్చిపోయాడు. దీన్ని కుమార్​ గుర్తించుకుండానే ముందుకు సాగాడు.. మార్గమద్యంలో ఒక ప్రయాణికురాలు తన ఆటోలో ఎక్కింది.

ఆటో సీటుపై బ్యాగ్‌ ఉండడాన్ని గమనించి, దాని గురించి కుమార్‌కు తెలియజేసింది.​ ఆమెను తన గమ్యస్థానమైన శ్రీనగర్ వద్ద దింపేసి, పాండే దిగిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు ఆటో డ్రైవర్​. పాండే ఆటో దిగినప్పుడు ఒక దుకాణంలోకి వెళ్లిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. వెంటనే ఆ దుకాణదారుడి వద్దకు వెళ్లి పాండే గురించి ఆరా తీశాడు. మరోవైపు, ఆటో దిగిన కొద్దిసేపటికి తన బ్యాగు మర్చిపోయానని గ్రహించిన పాండే చమన్​పేట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ లోపు ఆటో డ్రైవర్​ కూడా పాండే బ్యాగుతో చమరాజ్​పేట పోలీస్​ స్టేషన్​కు వచ్చి ఆ బ్యాగును పోలీసులకు అప్పగించాడు.

రూ.8000 రివార్డ్​ అందించిన డీజీపీ..
ప్రయాణికుడి బ్యాగ్​ను తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్​ నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. కాగా, ఈ సంఘటనను ఒక పోలీసు అధికారి వివరిస్తూ “ముంబైకి చెందిన పాండే రెండు బ్యాగులతో ​ఆటో ఎక్కాడు. ఒక బ్యాగులో తన వస్తువులు పెట్టుకోగా, మరో బ్యాగ్​లో 2.6 లక్షల నగదు పెట్టుకున్నాడు. పాండే తన గమ్యస్థానానికి చేరుకున్న తరువాత, డబ్బు ఉన్న బ్యాగ్​ను తీసుకెళ్లడం మర్చిపోయాడు. ఆలస్యంగా గ్రహించిన పాండే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.

అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్​ను పట్టుకునేందుకు బయలుదేరుతుండగా ఆటోడ్రైవరే స్వయంగా పోలీస్​ స్టేషన్​కు వచ్చి బ్యాగ్​ను అందించాడు. బ్యాగ్​లోని నగదును పోలీసులు సరిచూసి నిర్థారించిన తర్వాత ఆ బ్యాగ్​ను పాండేకు అప్పగించాం.”అని అన్నాడు. కాగా, కుమార్ నిజాయితీకి బహుమతిగా పాండే రూ .3,000 అందేజేశాడు. మరోవైపు ఆటోడ్రైవర్​ నిజాయితీని మెచ్చుకున్న డిసిపి పాటిల్ అతన్ని రూ .8,000 బహుమతితో సత్కరించారు.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు