ఆ అమ్మాయి వయసు 17ఏళ్లు. బాగా చదువుకునే ఏజ్. కాదంటే ఫ్రెండ్స్‌తో హ్యాపీగా కాలక్షేపం చేయాల్సిన వయసు. అలాంటి ఆలోచన లేకపోతే ఫ్యామిలీతో జాలీగా గడపాలి. కానీ టీనేజ్‌లో ఉన్న ఆ అమ్మాయి ఇంట్లో నుంచి అర్దాంతరంగా వెళ్లిపోయింది. ఎందుకు వెళ్లిందో తెలిస్తే షాక్ అవుతారు. కర్నాటక (Karnataka) రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు బెంగుళూరు (Bangalore)పోలీసులతో పాటు కుటుంబ సభ్యుల్ని ఎంతగానో కలవెరపెడుతోంది. బెంగుళూరులో నివాసముంటున్న 17ఏళ్ల అనుష్క(Anushka)రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ వార్త విని మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత ఆమె ఎందుకోసం వెళ్లిందో తెలుసుకొని అయోమయానికి గురవుతున్నారు. అర్చన(Archana), అభిషేక్ (Abhishek) దంపతుల కుమార్తే అనుష్క. కాలేజీ (Collage) చదువుకుంటున్న 17ఏళ్ల అమ్మాయికి బుర్రలో ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. అదే ఆమెను ఇల్లు వదిలివెళ్లేలా చేసిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అసలు అనుష్క ఇల్లు వదిలి వెళ్లడం వెనుక ఏం జరిగిందో తెలుసా. మన పూర్వికుల గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఆత్మలతో మాట్లాడితే ఎలా ఉంటుంది. ఆత్మలు ఎక్కడుంటాయి. వాటి కోసం వెదకడం వంటివి చేస్తుంటారు. దీన్నే షామనిజం (Shamanism)అంటారు. బెంగుళూరు(Bangalore)అమ్మాయి అనుష్క మదిలో కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలో పుట్టాయి. వాటినే ఆలోచిస్తూ..ఇంట్లో కూడా అందరితో తరచూ గొడవపడుతూ ఉండేది. ఆమె చెప్పేది ఎవరైనా వ్యతిరేకిస్తూ మీరంతే నన్ను అర్ధం చేసుకోరంటూ ఆగ్రహంతో ఊగిపోయేది.
అనుష్క ఎలా అదృశ్యమైంది..
అనుష్క అదృశ్యమయ్యే ముందు రోజు ఇంట్లో గొడవపడింది. తనను అర్ధం చేసుకోరు..నా మాట ఎవరూ వినరూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందని తల్లి అర్చన బెంగుళూరు పోలీసులకు తెలిపింది. అంతే కాదు ఇంట్లో ఉన్న సమయంలో కూడా పూర్వికులు, ఆత్మ గురించే ఆలోచించేదని తెలిపారు. యుక్తవయసులో ఉన్న కూతురు ఇంట్లోంచి వెళ్లి రెండు నెలలు గడిచింది. ఎటు వెళ్లిందో తెలియదు. ఎక్కడికి వెళ్లిందో జాడ దొరకలేదు ఆమె తల్లిదండ్రులు అర్చన, అభిషేక్‌కి. దీంతో ఇద్దరు వెళ్లి పోలీసు(Police)లకు ఫిర్యాదు చేశారు. కనిపించకుండాపోయిన తమ బిడ్డను వెదికిపెట్టమని పోలీసుల్ని వేడుకోవడంతో వారు ప్రత్యేక బృందాలతో అమ్మాయిని వెదుకుతున్నారు.
ఆందోళనలో అనుష్క పేరెంట్స్..
కన్నపేగు కదా..కూతురు కనిపించడం లేదంటే తల్లిదండ్రుల తపన అలాగే ఉంటుంది. అనుష్క కనిపించకపోవడంతో ..తండ్రి అభిషేక్(Abhishek)పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు పెడుతున్నాడు. తన బిడ్డ ఆచూకి తెలిస్తే ఎవరైనాా తనకు సమాచారం ఇవ్వమని అందర్ని కోరుతున్నాడు. మరీ ఇంటి నుండి వెళ్లిన అనుష్క నిజంగానే ఆత్మలతో మాట్లాడేందుకు వెళ్లిందా..? లేక మరెవరితోనైనా వెళ్లిందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, Anushka Shetty, Bangalore