హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amazon: ట్విట్టర్,మెటా బాటలోనే అమెజాన్ .. ఎన్ని వేల మందిని తొలగిస్తున్నారో తెలుసా..?

Amazon: ట్విట్టర్,మెటా బాటలోనే అమెజాన్ .. ఎన్ని వేల మందిని తొలగిస్తున్నారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon | Layoff: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమైందని కొన్ని వర్గాల సమాచారం. అమెజాన్‌ తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి, ఉద్యోగులపై కనిపించే ప్రభావం ఎంతో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ స్థాయి టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపులు (Layoffs)కొనసాగుతున్నాయి. ఇటీవలే ట్విట్టర్‌(Twitter), మెటా( Meta)సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించగా, ఈ జాబితాలో అమెజాన్‌ కూడా చేరనుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమైందని కొన్ని వర్గాల సమాచారం. అమెజాన్‌(Amazon)తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి, ఉద్యోగులపై కనిపించే ప్రభావం ఎంతో తెలుసుకుందాం.

RBI Penalty: ఒకేసారి 9 బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ!

10వేల మందిపై అమెజాన్‌ వేటు..

రాబోయే కొద్ది రోజుల్లో సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలనే యోచనలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఉంది. కొన్ని సోర్సెస్‌ ద్వారా ఈ విషయం తెలిసినట్లు సోమవారం వెల్లడించింది న్యూయార్క్ టైమ్స్‌ వార్తాసంస్థ. ఈ రిపోర్ట్ ప్రకారం.. కంపెనీ కార్పొరేట్ ఉద్యోగులలో దాదాపు మూడు శాతం మందిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రధానంగా గంటలవారీగా పనిచేసే 1.5 మిలియన్లకు పైగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఒక శాతం మందిపై లేఆఫ్స్ ప్రభావం చూపనుంది. వాయిస్-అసిస్టెంట్ అలెక్సా సహా అమెజాన్ డివైజెస్‌ ఆర్గనైజేషన్‌, కంపెనీ రిటైల్ విభాగం, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగంలో కోతలు ఉంటాయని న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక తెలిపింది.

భారీగా తగ్గిన ఉద్యోగులు..

గత ఏడాది డిసెంబర్ 31 నాటికి, అమెజాన్‌లో దాదాపు 16,08,000 మంది ఫుల్‌ టైమ్‌, పార్ట్‌టైమ్ ఉద్యోగులు ఉన్నారు. అదే రోజున అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన జీవితకాలంలో తన 124 బిలియన్‌ డాలర్ల నెట్‌ వర్త్‌లో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలియజేశారు. టెక్ దిగ్గజం ఏప్రిల్, సెప్టెంబర్ మధ్యకాలంలో దాదాపు 80,000 మంది వ్యక్తులను తొలగించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రధానంగా పెరిగిన అట్రిషన్ రేటు కారణంగా గంటలవారీగా పని చేసే సిబ్బందిని తగ్గించారని తెలిపింది.

రిక్రూట్‌మెంట్స్ బంద్..

అమెజాన్ సెప్టెంబర్‌లో అనేక స్మాల్‌ టీమ్‌లలో రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసింది. అక్టోబర్‌లో ప్రధాన రిటైల్ వ్యాపారంలో 10,000 కంటే ఎక్కువ ఓపెన్ రోల్స్‌ను భర్తీ చేయడం ఆపేసింది. రెండు వారాల క్రితం క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం సహా కంపెనీ అంతటా కార్పొరేట్ నియామకాలను కొన్ని నెలల పాటు బ్యాన్ చేసింది. దీంతో దాదాపు ఒక వారం తర్వాత ఉద్యోగ అభ్యర్థులకు రిక్రూటర్‌లకు మధ్య సంప్రదింపులు జరగలేదు.

Jobs In IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఐదు రీజియన్ల వారీగా భర్తీ..

ట్విట్టర్‌, మెటా బాటలో అమెజాన్‌

గత వారం ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఖర్చులను నియంత్రించడానికి 11,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను లేదా 13 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించనున్నట్లు తెలిపింది. అదే విధంగా ట్విట్టర్ కొత్త యజమాని బిలియనీర్ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా వర్క్‌ఫోర్స్‌ను సగానికి తగ్గించారు. దీంతో పెద్ద మొత్తంలో వర్క్‌ఫోర్స్‌ను తగ్గించిన ట్విట్టర్‌, మెటా, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ , ఇతర కంపెనీల జాబితాలో అమెజాన్‌ కూడా త్వరలో చేరనున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Amazon, JOBS, Lay offs

ఉత్తమ కథలు