కాలుష్యపు కోరల్లో బెంగళూరు... గాలిలో భారీగా కాలుష్య కారకాలు.. నిర్ధారించిన గాలి శుద్ధి పరికరాలు

ప్రతీకాత్మక చిత్రం

నగరంలో ఏర్పాటు చేసిన గాలి శుద్ధి పరికరాలతో గాలిలో భారీగా లెడ్, క్రోమియం సహా జింక్, ఐరన్, మాంగనీస్ వంటి లోహపు సముదాయాలు ఉన్నట్లు గుర్తించామని అటెక్ట్రాన్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ కృష్ణ తెలిపారు.

 • Share this:
  బెంగళూరు, కర్ణాటక: నగరంలో విపరీతంగా పెరుగుతున్నకాలుష్యాన్ని నివారించేందుకు బెంగళూరు మహానగరపాలిక సంస్థ(బిబిఎంపి) నడుం బిగించింది. గాలిలో లెడ్, క్రోమియం వంటి లోహపు కారకాలు భారీగా ఉన్నట్లు గుర్తించి, ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అటెక్ట్రాన్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, నగరంలో గాలి శుద్ధ పరికరాలను ఏర్పాటు చేసింది.

  నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్యంపై చేసిన పరిశోధనలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన గాలి శుద్ధి పరికరాలతో గాలిలో భారీగా లెడ్, క్రోమియం సహా జింక్, ఐరన్, మాంగనీస్ వంటి లోహపు సముదాయాలు ఉన్నట్లు గుర్తించామని అటెక్ట్రాన్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ కృష్ణ తెలిపారు. వీటి వల్ల నగర ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉన్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. హడ్సన్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన గాలి శుద్ధి పరికరం కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 19 గ్రాముల ధూళి కణాలను, ఒక రోజు వ్యవధిలో 800 గ్రాముల నుంచి 1000 గ్రాముల ధూళి కణాలను సేకరించిందని తెలిపారు. వీటి ద్వారా భారీగా నల్లని కార్బన్ లోహపు కారకాలు కనుగొన్నట్లు చెప్పారు.
  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం, గాలిలోని ధూళికణాల్లో మొదటి రకమైన పిఎం 2.5 కి సంబంధించి, ఎనిమిది గంటల వ్యవధిలో 10 μg/m3 (1 μm/m3=10 లక్షల గ్రాములు) గాను 48 μg/m3 సేకరించిందని, ఇదే వ్యవధిలో ధూళికణాల్లో రెండవ రకమైన పిఎం10 కి సంబంధించి 20 μg/m3 గాను 90 μg/m3 ధూళి కణాలను సేకరించిందని ఆయన వివరించారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

  గాలి శుద్ధి పరికరం (Courtesy-Atechtron )


  తగలబెట్టిన చెత్త, పెరిగిన ట్రాఫిక్, పరిశ్రమలు విడుదల చేసే ప్లాస్టిక్, లోహాలు, తుంపరల వంటి వ్యర్హ పదార్థాల వల్ల గాలిలో భారీగా క్రోమియం, కాపర్, మెర్క్యూరి, లెడ్ లోహాల శాతం పెరిగిపోతోందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ సైన్సెస్ కు చెందిన కేంద్ర పర్యావరణ శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ టి వి రామచంద్ర చెప్పారు. తాజా నివేదికలపై స్పందిస్తూ, పిఎం 2.5, పిఎం 10 లకు సంబంధించి ఎనిమిదింతలుగా పెరిగిన కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని ఆయన అన్నారు. కాలుష్యాన్ని నియంత్రించడంలో కర్నాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ(కెఎస్ పిసిబి) విఫలమైందని, కాలుష్యం తగ్గుముఖం పట్టిందని చేసిన ప్రకటనలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.

  లెడ్, జింక్, మెర్క్యూరీ, ఆర్సెనిక్, క్రోమియం తదితర లోహాలు గాలిలో వ్యాప్తి చెందడం వల్ల పిల్లల్లో ఎదుగుదల, వారి జన్యుస్థాయిపై తీవ్ర ప్రభావం చూపనుందని సెంటర్ ఫర్ సైన్స్ స్పిరిచ్యులాటీ కి చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ శశిధర గంగయ్య చెప్పారు. చెత్త చెదారాలని తగలబెట్టడం వల్ల డియోక్సిన్ వంటి విష వాయువులు విడుదలై కాన్సర్ కు కారణమవుతాయని ఆందోళన చెందారు.

  అంతర్జాతీయ జర్నల్ అఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్సెస్ (ఐజేపిఎఆర్ ) చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయం వెల్లడి కావడం గమనార్హం. భారీగా విడుదల అవుతున్న లోహపు కణాల వల్ల మానవ శరీరంలోని జీవ ప్రక్రియలను దెబ్బతీసే ప్రమాదం ఉందని, ఇందులో జింక్ పాత్ర కీలకమైందని వెల్లడించింది.. సహజమైన, మానవ జన్యు పరమైన మూలాలు ప్రకృతికి పెనుశాపంగా మారిందని పేర్కొంది.

  కాడ్మియం మోతాదుకు మించితే శరీరంలోని అతిముఖ్యమైన జీవ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తద్వారా పోషకాహార లోపాలు తలెత్తుతాయని, మాంగనీస్ పర్యావరణంలో ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే విష ప్రభావం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం తెలిపింది.

  ప్రతీసారి వాస్తవాలను దాచిపెడుతున్న కెఎస్ పిసిబి కి వాయు శుద్ధి పరికరాల ద్వారా వెల్లడైన నిజాలు చెంపపెట్టు అని భారతీయ పర్యావరణ పరిరక్షణ శాఖ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఎల్లప్పా రెడ్డి చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన వాయు శుద్ధి పరికరాలు వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టాయని ఆయన పేర్కొన్నారు. కేవలం మనిషి మెదడు ఎదుగుదల పైనే కాకుండా, మొక్కలు, జంతువులు, నీరు, భూమి పైకూడా లెడ్, జింక్ తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు.నగరంలోని పరిశ్రమలను, మూసివేయాలని, మరో మార్గం లేదని ఆయన స్పష్తం చేశారు.

  (Author is freelance writer and a member of 101Reporters.com)
  Published by:Ashok Kumar Bonepalli
  First published: