బెంగళూరు(Bengaluru)కు చెందిన అనిల్ శ్రీవత్స(Anil Srivatsa)(54) అనే అవయవ దాత(Organ Donor).. రోడ్డు మార్గంలో 56,000 కి.మీ దూరం ప్రయాణించి ఆస్ట్రేలియాలోని(Australia) పెర్త్‌కు చేరుకోనున్నారు. 2023 ఏప్రిల్‌లో(April) జరగనున్న వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్(WTG)లో పాల్గొనడానికి 17 దేశాలను దాటి ఆస్ట్రేలియాకు చేరుకొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 20న బెంగళూరు(Bangalore) నుంచి బయలుదేరి వరల్డ్(World) ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లో బాల్-త్రో, స్విమ్మింగ్‌లో(Swimming) పోటీపడనున్నారు. 2014 సెప్టెంబర్‌లో అనిల్ శ్రీవత్స అన్నయ్య డాక్టర్(Doctor) అర్జున్ శ్రీవత్స కిడ్నీ డిజార్డర్‌తో బాధపడుతున్న సమయంలో.. అనిల్ తన కిడ్నీలో ఒకదాన్ని దానం చేశారు. అప్పటి నుంచి ఆయన అవయవ దానానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 2019లో న్యూకాజిల్‌లో వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్(Games) జరిగినప్పుడు, అనిల్ 100 మీటర్ల రేసు, బాల్-త్రో పోటీలో పాల్గొన్నారు. దాతల విభాగంలో అతను బాల్-త్రోలో గోల్డ్ మెడల్ సాధించగా, అతని సోదరుడు గోల్ఫ్‌లో గోల్డ్ మెడల్ అందుకొన్నారు.
Lemons stolen: నిమ్మకాయలను చోరీ చేసిన బత్తాయిలు.. కారణం ఏంటో తెలుసా?
తన ప్రయాణ విషయాలపై అనిల్ శ్రీవత్స మాట్లాడుతూ..‘మార్చి చివరి వారంలో బెంగళూరు నుంచి కశ్మీర్‌కు వెళ్లాను. కశ్మీర్ డ్రైవ్ సమయంలో 5,000 మందికి పైగా ప్రజలతో మాట్లాడాను. రిషికేశ్‌లో గంగా హారతి సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడాను.’ అని చెప్పారు. అతను కశ్మీర్ లోయలో భారత సైన్యం కోసం ఒక సెషన్ కూడా నిర్వహించారు. రాబోయే ఒక సంవత్సరం పాటు.. పెర్త్‌కు ప్రయాణిస్తున్న సమయంలో అవయవ దానంపై అవగాహన కల్పిస్తానని, ప్రజలను ఉద్దేశించి ఆయా ప్రాంతాల్లో ప్రసంగిస్తానని చెప్పారు. వివిధ కార్యక్రమాల్లో చాలా మంది యువకులు.. అవయవాలు దానం చేసిన తర్వాత దాతకు ఏమవుతుంది? అనే ప్రశ్నను అడిగినట్లు అనిల్ తెలిపారు. ప్రేక్షకుల్లో వృద్ధులు ఉంటే.. తదుపరి జీవితంలో దానం చేసిన అవయవాన్నే తాము కోల్పేతే ఎలా? అనే ప్రశ్న ఎక్కువగా ఎదురవుతుందని చెప్పారు.
* ఎదురుచూస్తూ ఎవ్వరూ చనిపోకూడదు..
అవగాహన కార్యక్రమాల నిర్వహణపై అనిల్ వివరిస్తూ..‘ఇటువంటి స్పిరుచ్యువల్ ప్రశ్నలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. నేను NGO గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అడ్వెంచర్ మేనేజింగ్ ట్రస్టీగా కూడా పనిచేస్తున్నాను. అవయవ దానం తర్వాత, తరచుగా చెక్-అప్‌లు చేయించుకోవడం వల్ల మరింత ఆరోగ్య స్పృహతో ఉంటారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ చార్టర్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నాను. ఆ హోదాలోనే ఈ నెలాఖరున న్యూయార్క్ వెళ్తున్నాను. నా కారు ఇప్పటికే అక్కడికి చేరింది. నాతోపాటు నా భార్య దీపాలి కూడా ఉన్నారు.
డబ్బును ఆదా చేయడానికి వాహనంలో నివసించాలని నిర్ణయించుకొన్నాం. ప్రయాణంలో ఎక్కువ భాగం వంట చేయాలని కూడా ప్రణాళిక వేసుకొన్నాం. ప్రయాణ సమయంలో భూభాగం పరిస్థితుల ఆధారంగా రెండు వాహనాలను వినియోగిస్తాం. న్యూయార్క్ నుంచి హ్యూస్టన్‌కు వెళ్తాను. అక్కడ రోటరీ ఇంటర్నేషనల్ టీమ్ తరఫున ఫ్లాగ్ ఆఫ్ నిర్వహించాల్సి ఉంది. అనంతరం ఆర్కిటిక్ మహాసముద్రం వరకు ప్రయాణించి దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా కొన వద్ద ఉన్న అంటార్కిటిక్ మహాసముద్రం వరకు పాన్ అమెరికన్ హైవేపై దక్షిణం వైపు ప్రయాణం చేస్తాం. అనంతరం వాహనాన్ని సిడ్నీకి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. WTG సమయానికి ఆస్ట్రేలియా చేరుకొనేలా ప్రణాళిక ఉంది.’ అని చెప్పారు.
కోడలిపై మామ లైంగిక దాడికి ప్రయత్నం.. స్నేహితుడి భార్యతో మరో వ్యక్తి అలా..
అవయవం కోసం ఎదురుచూస్తూ గ్రహీతలు చనిపోకుండా కాపాడాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోటేరియన్లను ఏకం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నానని అనిల్ తెలిపారు. పోలియో నిర్మూలనలో రొటేరియన్లు కలిసి పనిచేసినట్లే తాను కూడా చేస్తానని చెప్పారు. 2019 WTGలో భారత్ నుంచి 14 మంది పోటీదారులు ఉన్నారు. 2023లో మళ్లీ గోల్ఫ్‌లో పాల్గొనే డాక్టర్ అర్జున్‌తో సహా వారి సంఖ్య 40 కి చేరుకునే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.