హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అమానుషం : సమ్మెకు విరుద్దంగా విధుల్లో చేరిన డ్రైవర్‌ను కొట్టి చంపిన తోటి ఉద్యోగులు

అమానుషం : సమ్మెకు విరుద్దంగా విధుల్లో చేరిన డ్రైవర్‌ను కొట్టి చంపిన తోటి ఉద్యోగులు

FILE PHOTO

FILE PHOTO

bengalor : తోటి ఉద్యోగినే తమకు వ్యతిరేకంగా ఉన్నాడని కొట్టారు..దీంతో ఆ ఉద్యోగి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఆర్టీసీలో చోటుచేసుకుంది.


ఓ వైపు కరోనాతో ప్రజలు సతమతవుతుంటే..మరోవైపు కర్ణాటక ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం తమ పంతం నెగ్గించుకుంటున్నారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన ఉద్యోగులు వారిని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా తమ సంస్థ ఉద్యోగినే కోట్టి చంపారు.

కర్ణాటకలో ఆర్టీసీ సమ్మె గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. దీంతో ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో హజరు కావడం లేదు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కొంతమంది ఉద్యోగులను విధుల్లో చేరాలని విజ్ఝప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆర్టీసీ ఉద్యోగి ప్రభుత్వ పిలుపు మేరకు శుక్రవారం కర్ణాటక లోని బాగల్‌కోటే జిల్లా,జమల్ ఖండి ఆర్టీసీ డిపోకు చెందిన 46 ఏళ్ల అవటి అనే డ్రైవర్ విధుల్లో చేరాడు. బస్సును తీసి నడిపేందుకు ప్రయత్నం చేశాడు.

అయితే ఓ వైపు ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తుండడం, దాన్ని నీరుగార్చేందుకు ఇతర ఉద్యోగులు , ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడంతో ఆగ్రహానికి గురైన ఇతర ఉద్యోగులు విధుల్లో చేరిన ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా బస్సునుండి క్రిందకు లాగారు. దీంతో కిందపడ్డ డ్రైవర్ అవటి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం ఉద్యోగి మృతిచెందాడు. దీంతో రాష్ట్ర్ర రవాణశాఖ అధికారులు , మంత్రులు చాల విచారం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Bengaluru, Rtc

ఉత్తమ కథలు