BENGALURU A LOCOMOTIVE PILOT STOPS AN HOUR LONG TRAIN IN KARNATAKA AFTER SEEING CLOTHES ON RAILWAY POWER LINES SNR
Karnataka:కరెంట్ తీగలపై బట్టలు ఆరేశారని..ఆ లోకో పైలట్ ఎంత పని చేశాడో తెలుసా
Photo Credit:Twitter
OMG: కర్నాటకలో ఓ ట్రైన్‌ను గంటసేవు నిలిపివేశారు. బెంగుళూరు డివిజన్లో బసవ ఎక్స్‌ప్రెస్ బయల్దేరే సమయంలో రైల్వే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసినట్లుగా ఉండటంతో లోకో పైలెట్ ట్రైన్‌ని ఆపేశాడు. ఎందుకో తెలిసిన తర్వాత రైల్వే అధికారులు షాక్ అయ్యారు. ప్రయాణికులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
ఉతికిన బట్టలు దండెం మీద లేదంటే టెర్రస్‌పైన ఆరబెట్టుకుంటారు. బస్తీలు, కాలనీల్లో ఉండే వాళ్లు అయితే ఇంటి దగ్గర తాడు కట్టుకొని వాటిపైన ఆరేసుకుంటారు. కాని కర్నాటక(Karnataka)లోని రామనగర ప్రాంతంలో కరెంట్ తీగలపై ఉతికిన బట్టలు ఆరబెట్టినట్లుగా ఉన్న ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఫోటోనే కాదు అసలు అలా జరగడ వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో..ఎలాంటి సమస్య తలెత్తిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కర్నాటక బెంగుళూరు డివిజన్లోని రామనగర (Ramanagara)ప్రాంతంలో ఉండే స్థానికులు ఉతికిన దుస్తులను ఆరబెట్టారు. అవి ఈదురు గాలులకు ఎగిరిపోయి రైళ్లకు విద్యుత్ సప్లై అయ్యే ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్( Over Head Equipment)వైర్లపై పడ్డాయి. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో బసవ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (Basava Express)2.55నిమిషాలకు స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరే సమయంలో లోకో పైలెట్ రామనగర దగ్గర విద్యుత్ తీగలపై దుస్తులు ఆరేసినట్లుగా ఉండటాన్ని గమనించి ముందస్తు జాగ్రత్తగా ట్రైన్‌ని చన్నపట్నం(Channapatna station) రైల్వే స్టేషన్లో 55నిమిషాల(55 minutes)పాటు నిలిపివేశారు. మైసూర్-బాగల్గోట్ ఎక్స్‌ప్రెస్, మైసూర్-చెన్నై శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (Shatabdi Express)ట్రైన్లు కూడా అదే రూట్లో వెళ్లాల్సి ఉంది. అయితే బసవ ఎక్స్‌ప్రెస్ షడన్‌గా నిలిచిపోయిందన్న వార్తను ఆలస్యంగా తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటన స్తలానికి చేరుకున్నారు. ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ తీగలపై ఆరేసినట్లుగా వేలాడుతున్న బట్టలను బెంగుళూరు డివిజన్లోని ఎలక్ట్రిక్ విభాగం సిబ్బందితో తొలగించారు.
రైల్వే అధికారుల తెలివి తేటలు..
చన్నపట్నంలో లోకో పైలెట్ ట్రైన్ ఆపడంపై బెంగుళూరు రైల్వే డివిజన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కారణంతో ట్రైన్‌ని ఎలా ఆపారంటూ లోకోపైలెట్ని నిలదీశారు. విద్యుత్ తీగలపై ఆరేసినట్లుగా బట్టలు కనిపించిన వెంటనే బెంగుళూరు డివిజల్ రైల్వే మేనేజర్ శ్యామ్సింగ్కు ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తే స్పందించలేదని లోకో పైలెట్ వెల్లడించాడు. అలాగే ట్రైన్‌కి విద్యుత్ సప్లై అయ్యే తీగల ద్వారా ట్రైన్‌కి 25కేవీల విద్యుత్ సప్లై అయ్యే అవకాశం ఉందని లోకో పైలెట్ తెలిపాడు. సాహసించి ట్రైన్‌ని ముందుకు తీసుకెళ్లి ఉంటే విద్యుత్ తీగలు రైలు బోగీల పై భాగంలో తగిలి మంటలు చెలరేగితే ట్రైన్ పనిచేసేది కాదని అధికారులకు తెలిపాడు. ట్రాక్‌పై ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాటిని సరిచేయడానికి ఒకరోజు సమయం పట్టేందని అందుకే ట్రైన్‌ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చిందని లోకో పైలెట్ రైల్వే అధికారి తెలిపారు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల వేలాదికి తిప్పలు..
రామనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈదురు గాలులు కారణంగానే బసవ ఎక్స్‌ప్రెస్‌తో పాటు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు నిలిపివేశారు. వాటిలో ప్రయాణిస్తున్న వాళ్లు షడన్‌గా రైలు ఆగిపోవడంతో ఒకింత అసహనానికి గురయ్యారు. సుమారు గంట సేవు ట్రైన్లోనే ఉండాల్సి రావడంతో తీవ్ర అవస్థలు పడ్డారు.
(ఇదెక్కడి విచిత్రం బాబోయ్)
రైల్వేశాఖ ఉన్నతాధికారులు సమయానికి స్పందించి ఉంటే ఇంత మంది ప్రయాణికుల సమయం వృధా అయ్యేది కాదని మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.