Book on Pandemic: లాక్‌డౌన్ సమయంలో పుస్తకం రాసిన బెంగళూరు బాలిక.. దేని గురించంటే.. 

ప్రతీకాత్మక చిత్రం

జియా గంగాధర్ అనే ఈ పాప ఈ పుస్తకాన్ని రాసేందుకు తన తల్లి ప్రోత్సాహం అందిస్తే.. ఈ పుస్తకం పబ్లిష్ అవ్వడానికి తన టీచర్ ఏఎస్ దివ్య సహాయం అందించారని మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది.

  • Share this:
సాధారణంగా ఏడేళ్ల పిల్లలంటే ఎలా ఉంటారు.. అల్లరి చేస్తూ.. ఆడుకుంటూ.. చదువుకుంటూ ఆనందంగా గడిపేస్తారు. కానీ కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్‌తో పిల్లలంతా ఇంటికే పరిమితమైపోయారు. ఆన్ లైన్ లోనే క్లాసులు వింటున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏకంగా ఒక పుస్తకం రాసింది బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలిక. కరోనా మహమ్మారి సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను అందులో పొందుపరిచింది. ఈ పుస్తకం పేరు "ఎల్ ఫర్ లాక్ డౌన్, జియాస్ జర్నల్ ఆఫ్ లాక్ డౌన్ లెసన్స్". జియా గంగాధర్ అనే ఈ పాప ఈ పుస్తకాన్ని రాసేందుకు తన తల్లి ప్రోత్సాహం అందిస్తే.. ఈ పుస్తకం పబ్లిష్ అవ్వడానికి తన టీచర్ ఏఎస్ దివ్య సహాయం అందించారని మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది. తాను రాసే డైరీని చూసిన తన తల్లి దాన్ని పుస్తకంగా రాస్తే బాగుంటుందని ప్రోత్సహించిందట.

అమెజాన్ లో రూ. 158 కి ఈ పుస్తకం అందుబాటులో ఉంది. నాన్ ఫిక్షన్ కేటగిరీలో ఉన్న ఈ పుస్తకం డిస్క్రిప్షన్ లో "కరోనా మహమ్మారి సమయంలో జియా ఎదుర్కొన్న అనుభవాల సారం ఈ పుస్తకం. ఓ చిన్నారి ఇంట్లోనే ఉంటూ ఎదుర్కొన్న కొత్త అనుభవాలు, కొత్త అలవాట్లు, కొత్త భయాలు, తన ఆలోచనలు, నేర్చుకున్న విషయాలన్నీ ఈ పుస్తకంలో భాగమే" అంటూ రాయడం విశేషం.

ఈ పుస్తకంలో జియా ఎదుర్కొన్న మంచి, చెడు అనుభవాలన్నీ ఉన్నాయి. ఇంట్లోనే క్లాసులు అటెండ్ కావడం, పాలవాడు, పేపర్ వాళ్లతో మాటలు, ఆన్ లైన్ లో గేమ్స్, సైబర్ క్రైమ్స్ పాఠాలు అన్నీ ఇందులో వివరించింది జియా. దీని గురించి ఆమె మాట్లాడుతూ "గత సంవత్సర కాలంగా నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు ఆన్ లైన్ లోనే క్లాసులు అవుతున్నాయి. మిగిలిన సమయం అంతా ఖాళీగా గడిపేదాన్ని. దీంతో మా అమ్మ ఇలా పుస్తకం రాస్తే బాగుంటుందన్న సలహా ఇచ్చింది. నేను స్కూల్ కి వెళ్తే ఈ పుస్తకాన్ని రాసి ఉండేదాన్ని కాదేమో.. మా అమ్మానాన్న కూడా ఈ సమయంలో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాకు చాలా సహాయం చేశారు" అంటూ వెల్లడించింది.

కోల్ కతాకి చెందిన మరో పదేళ్ల కుర్రాడు రేయాంశ్ కూడా "ద యూనివర్స్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశాడు. రేయాంశ్‌కి ఐదేళ్ల వయసు నుంచే స్పేస్ సైన్స్ పై ఆసక్తి ఎక్కువట. దానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగేవాడట. ఆస్ట్రోనామికల్ పుస్తకాలు చదవడం, వీడియోలు చూడడం చేసేవాడట. ఏడు సంవత్సరాలకే తాను తెలుసుకున్న విషయాలన్నింటితో పుస్తకం రాయాలనుకున్న రేయాంశ్.. 2019లో ఈ పుస్తకాన్ని ప్రారంభించి ఇటీవలే పూర్తి చేశాడు.
Published by:Sumanth Kanukula
First published: