BENGALURU 50 BRIBE KTAKA STAFFER GETS HC RELIEF AFTER 24 YRS GH VB
Bribe Case: అతడు 24 ఏళ్ల క్రితం రూ.50 లంచం తీసుకున్నాడు.. ఏ శిక్ష విధించారో తెలుసా..?హైకోర్టు తీర్పు ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
24 ఏళ్ల క్రితం కర్ణాటక లోకాయుక్త ఆపరేషన్‌లో రూ.50 లంచం(Bribe) తీసుకుంటూ పట్టుబడ్డ కేసులో ప్రభుత్వ మాజీ ఉద్యోగికి ఆ రాష్ట్ర హైకోర్ట్(HIGH COURT) ఉపశమనం కలిగించింది. అతనిపై వచ్చిన ఆరోపణలకు నిర్భంద పదవీ విరమణను శిక్షగా విధించడం షాకింగ్‌కు గురి చేసిందని హైకోర్టు వ్యాఖ్యానిం?
24 ఏళ్ల క్రితం కర్ణాటక లోకాయుక్త ఆపరేషన్‌లో రూ.50 లంచం(Bribe) తీసుకుంటూ పట్టుబడ్డ కేసులో ప్రభుత్వ మాజీ ఉద్యోగికి ఆ రాష్ట్ర హైకోర్ట్(HIGH COURT) ఉపశమనం కలిగించింది. అతనిపై వచ్చిన ఆరోపణలకు నిర్భంద పదవీ విరమణను శిక్షగా విధించడం షాకింగ్‌కు గురి చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారిస్తున్న దార్వడ్ హైకోర్టు(High Court) బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. ఉద్యోగి చేసిన నేరానికి గతంలో విధించిన శిక్షను తగ్గించాలని ఆదేశించింది. ఈ మేరకు రెండు నెలల్లోపు ఉత్తర్వులను జారీ చేయాలని సంబంధిత క్రమశిక్షణా అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. MS కడ్కోల్ అనే వ్యక్తి కర్నాటకలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్నాడు. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో 1998, జనవరి 16న లోకాయుక్త ట్రాప్ చేసి పట్టుకుంది. లంచంగా తీసుకున్న నగదును అతను తన కాళ్ల సాక్స్‌లో దాచినట్టు గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించి అతనిపై చర్యలు తీసుకునేందుకు 2002లో విచారణ చేపట్టి 2004 సెప్టెంబర్ 7న విధుల నుంచి తొలగించారు. అప్పటికీ అతనికి ఇంకా 15 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉంది.
నిజానికి కడ్కోల్ సహోద్యోగి సెకండ్ డివిజన్ అసిస్టెంట్ నాయకర్‌ని పట్టుకోవడం కోసం లోకాయుక్త ట్రాప్ చేసింది. బ్యాడగి నుంచి ధర్వాడకు బదిలీ అయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రాచారి తన సర్వీస్ రికార్డులను పంపాలని నాయకర్ను కోరారు. అయితే అందుకు రూ. 150 లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక చంద్రాచారి మూడు 50 రూపాయాల నోట్లను నాయకర్‌కు లంచంగా ఇచ్చాడు. అందులో ఒకటి కడ్కోల్కు ఇచ్చాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన లోకాయుక్తా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించి నిర్భంధ పదవీ విరమణ ఉత్తర్వులు జారీ చేసింది.
లోకాయుక్త తీర్పును కర్ణాటక రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో సవాలు చేశాడు కడ్కోల్. నాయకర్ నుంచి రూ.50లను కేవలం చేతి బదులుగా మాత్రమే తీసుకున్నానని.. చంద్రాచారి నుంచి తాను ఎప్పుడు నగదును డిమాండ్ చేయలేదని కడ్కోల్ పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ జూన్ 1, 2016న దాన్ని కొట్టివేసింది.
దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. కడ్కోల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్జీ పండిట్, అనంత్ రామనాథ్ హెగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇద్దరు అసమానులను సమానంగా చూడబడ్డారని పేర్కొంది. నేరం చేసిన నాయకర్ పిటిషనర్ కడ్కోల్కి రూ.50 చెల్లించినట్లు డిపార్ట్ మెంటల్ విచారణలో తేలిందని, రికార్డుల్లో కూడా స్పష్టం చేస్తున్నాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో లంచం డిమాండ్ చేయడంలో కడ్కోల్ పాత్ర లేదని.. అందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవని డివిజన్ బెంచ్ పేర్కొంది. అలాగే పిటిషనర్ డబ్బు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారుడు (చంద్రాచారి) ఆరోపించలేదని డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పిటిషనర్ వద్ద ఫిర్యాదుదారునికి సంబంధించిన పని ఏదీ కూడా పెండింగ్‌లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కడ్కోల్పై విధించిన నిర్భంద పదవీ విరమణ శిక్ష అసంబద్ధమైందని శిక్షను తగ్గించాలని సంబంధిత క్రమశిక్షణా అథారిటీని హైకోర్టు ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.