Karnataka :240 కిలోమీటర్లు టార్గెట్.. తాత కోసం నడిచిన మనవరాలు.. పోలీసులకు షాక్... !

ప్రతీకాత్మక చిత్రం

Karnataka : తల్లి దండ్రులను కోల్పోయి బంధువుల ఇంట్లో చదువుకుంటున్న ఓ బాలిక.. తాతా అమ్మమ్మలు గుర్తుకు వచ్చారంటూ 240 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కలుసుకునేందుకు బంధువులకు చెప్పకుండా కాలినడకన బయలు దేరింది..

 • Share this:
  రక్తం పంచుకుపుట్టిన వాళ్లు ఎక్కడున్న ఒక్కటవుతారు.. వారి కోసమే తమ జీవితం అంటూ బతుకు ప్రయాణం కొనసాగిస్తారు. సంవత్సరాలుగా దూరంగా చివరికి ఒక్కటయ్యెందుకు తహతహలాడతారు. ఇలా తల్లిదండ్రులు లేని బాలిక(girl) కూడా తన తాతా అమ్మమ్మను కలిసేందుకు నడక దారి పట్టింది. ఇలా ఒకటి కాదు.. రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా 240 కిలోమీటర్ల అవతల ఉన్న తన తాతా అమ్మమ్మలను చూడాలని ఉందంటూ తన బంధువుల ఇంట్లో నుండి చెప్పాపెట్టకుండా బయలు దేరింది.

  బెంగళూరులోని(Bengalur) విరాజిపేట్​కు చెందిన అయ్యప్ప బనశంకరి అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట.. తల్లిదండ్రులు లేని తమ బంధువుల మనవరాలిని చదువుల కోసం బెంగళూరులోని తమ ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడే యడియూరులోని ప్రభుత్వ పాఠశాలలో(Govt school) బాలికను చేర్పించారు.

  ఇది చదవండి : నీట మునిగిన సిరిసిల్ల.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్


  కానీ.. ఆగస్టు 21న ఆమె కనిపించకుండా పోయింది. విషయం తెలిసిన అయ్యప్ప ఎంత వెతికినా.. ఆచూకీ కనుగొనలేకపోయాడు. చివరికి పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించగా.. పోలీసులు మిస్సింగ్(missing)​ కేసు నమోదు చేసుకున్నారు. ఇన్​స్పెక్టర్​ పుట్టస్వామి ఆధ్వర్యంలో.. ఎస్​ఐ మంజునాథ్​ బృందం బాలిక కోసం తీవ్రంగా గాలించింది. బసవనగుడి, చామరాజపేట, మైసూర్​ రోడ్డు ప్రాంతాల్లోని 250కిపైగా సీసీటీవీ కెమెరాల(cctv camera) ఫుటేజీ పరిశీలించారు.

  చివరకు రోడ్డుపై ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపెట్టారు. కెంగేరీలోని కూమ్మఘట్టె ప్రాంతం వరకు కాలినడకన వెళ్లిందని గుర్తించారు. రోహిత ఆచూకీ చెప్పాలని.. కూమ్మఘట్టె సహా పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కరపత్రాలు కూడా పంచారు .

  ఇది  చదవండి : రెండు రోజుల్లో యూఎస్ వెళ్లాల్సినవాడు.. వాకింగ్ కోసం వెళ్లాడు... 24 గంటల తర్వాత.


  చివరకు ఎలాగోలా ఆ బాలిక కేసును ఛేదించగలిగారు. బనశంకరి నుంచి నడక మొదలుపెట్టిన ఆమె.. కూమ్మఘట్టె వరకు చేరుకుంది. అంటే తాను బయలు దేరిన ప్రాంతం నుండి దాదాపు 30 కి.మీ. నడిచింది. అక్కడ రోడ్డుపక్కన నిల్చొని భయంభయంగా ఉన్న బాలికను ఓ మహిళ పలకరించగా .. తనకు తల్లిదండ్రులు లేరని, కొన్నిరోజులు ఆశ్రయం ఇవ్వాలని ఆమెను కోరింది.

  అలా 10 రోజులు ఆ బాలిక ఆ మహిళ ఇంట్లో ఉంది. బాలిక గురించి ఆరా తీసిన వారికి ఆమె ఇలా చెప్పింది. "నాకు తల్లిదండ్రులు లేరు. నేను మా అమ్మమ్మ-తాతయ్య ఇంటికి వెళ్లాలి. నా బంధువులు వచ్చి నన్ను తీసుకెళ్తారు. అప్పటివరకు నాకు ఆశ్రయం ఇవ్వండి.'' అభ్యర్థించింది.

  అయితే బాలిక ఉన్న విషయం చివరకు పోలీసులకు తెలిసింది. ఆ బాలికను పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి విచారించగా.. తాత వాళ్లు గుర్తొస్తున్నారని చెప్పింది. వారికోసమే ఎవరికి చెప్పకుండా కాలి నడకన బయల్దేరానని చెప్పింది..'నాకు మా అమ్మమ్మ, తాతయ్య గుర్తొస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉండలేను. అందుకే.. మా ఇంటికి వెళ్లాలని చెబుతోంది. దీంతో బాలికను పోలీసులు తాతా అమ్మమ్మలకు అప్పజెప్పారు పోలీసులు.
  Published by:yveerash yveerash
  First published: