Home /News /national /

BENGAL STARTUP COMPANY DEVELOPS A DEVICE TO PRODUCE OXYGEN FROM WATER UMG GH

OM Redox: నీటి నుంచి ఆక్సిజన్.. అద్భుతమైన ఆలోచన.. బెంగాల్‌లో సూపర్ స్టార్టప్

బెంగాల్‌లో కొత్త స్టార్టప్.. స్విచ్ నొక్కితే నీటి నుంచి ఆక్సిజన్.

బెంగాల్‌లో కొత్త స్టార్టప్.. స్విచ్ నొక్కితే నీటి నుంచి ఆక్సిజన్.

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని ఒక స్టార్టప్ (Start up) అద్భుతం చేసింది. కేవలం ఒక స్విచ్‌ను నొక్కితే, నీటి నుంచి ఆక్సిజన్‌ (Oxygen)ను ఉత్పత్తి చేసే డివైజ్‌ను అభివృద్ధి చేసింది. ఈ డివైజ్‌కు పరిశోధకులు 'OM Redox' అనే పేరు పెట్టారు. సోలైర్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Solaire Initiatives Pvt Ltd) అనే స్టార్టప్ ఈ ప

ఇంకా చదవండి ...
పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్టార్టప్ అద్భుతం చేసింది. కేవలం ఒక స్విచ్‌ను నొక్కితే, నీటి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే డివైజ్‌ను అభివృద్ధి చేసింది. ఈ డివైజ్‌కు పరిశోధకులు 'OM Redox' అనే పేరు పెట్టారు. సోలైర్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Solaire Initiatives Pvt Ltd) అనే స్టార్టప్ ఈ పరిశోధనకు వేదికైంది. వెబెల్-బీసీసీ అండ్ ఐ టెక్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో పరిశోధకులు ఈ సరికొత్త డివైజ్‌ను రూపొందించారు. తాము అభివృద్ధి చేసిన 'ఓఎమ్ రెడాక్స్' డివైజ్ నీటి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుందని సోలైర్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, పరిశోధకులు తెలిపారు. ఈ మెషిన్ కాన్సంట్రేటర్ నుంచి పొందే ఆక్సిజన్ కంటే 3.5 రెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను స్టార్టప్ వెంచర్ కోఫౌండర్లు డాక్టర్ సౌమ్యజిత్ రాయ్, ఆయన భార్య డాక్టర్ పీ లియాంగ్ గురువారం వెల్లడించారు.

ఈ డివైజ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఫస్ట్ బయో-టెక్ ఎక్స్‌పో 2022లో ప్రదర్శించనుంది. ‘ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఈ డివైజ్‌ ప్రెజర్ స్వింగ్ అడ్సార్పన్ మెథడ్‌ను ఉపయోగిస్తుంది. ఈ విధానంలో గాలిని ధ్రువీకరించే ప్రక్రియ కీలకపాత్ర పోషిస్తుంది. కాన్సంట్రేషన్ మాత్రం కంప్రెసర్, క్యాటలిస్ట్‌ను ఉపయోగిస్తుంది. ఈ రెండు పద్ధతుల్లోనూ ఆక్సిజన్ గాలి నుంచే ఉత్పత్తి అవుతుంది. కానీ మాది సరికొత్త ఆల్టర్నేటివ్ టెక్నాలజీ.’ అని రాయ్ తెలిపారు. ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. తమ ఆవిష్కరణను న్యూమాటిక్ కపుల్డ్ వాటర్ ఆక్సిడేషన్ బై ఎలక్ట్రోక్యాటలిటిక్ రియాక్షన్ (పవర్) అని పిలుస్తారని చెప్పారు.

75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేసిన పుస్తకంలో ఈ యంత్రం ప్రస్తావన ఉంది. ఈ టెక్నాలజీకి పేటెంట్ తీసుకున్నామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ కన్ఫర్మిటీ ఈ డివైజ్‌ టెక్నాలజీని ఆమోదించాయని రాయ్ పేర్కొన్నారు. డివైజ్‌కు లైసెన్స్ పొందడం, దాని తయారీతో పాటు మార్కెటింగ్ కోసం శాస్త్రవేత్తలైన రాయ్, ఆయన భార్య వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.



‘ఈ ప్రొడక్ట్ 8 కిలోల బరువు ఉంటుంది. దీంట్లో ఉండే ఒక స్విచ్‌ను నొక్కితే ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది విద్యుత్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు 3.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తుంది’ అని పీ లియాంగ్ చెప్పారు. ఆమె చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ పూర్తి చేశారు.

వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (వెబెల్), బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పీ లియాంగ్ మాట్లాడారు. ఈ డివైజ్‌ను సులభంగా తయారు చేయవచ్చని చెప్పారు. చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేసేలా దీన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో డివైజ్ మార్కెట్లోకి రావచ్చని చెప్పారు పశ్చిమ బెంగాల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (వెబెల్) మేనేజింగ్ డైరెక్టర్ సున్రితా హజ్రా.
Published by:Mahesh
First published:

Tags: Bengal, Oxygen bank, Start-Up, Water

తదుపరి వార్తలు