బిర్యానీ డబ్బులు అడిగినందుకు హత్య..!

ఒక్కో బిర్యానీకి 190 రూపాయలు కట్టాటలని యజమాని అడగడంతో.. ధర విషయమై వాగ్వాదం జరిగింది.  ఈ క్రమంలోనే నలుగురు కస్టమర్లలో ఒకరు హోటల్ యజమానిని తుపాకీతో కాల్చి..అక్కడి నుంచి పరారయ్యారు.

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 2:46 PM IST
బిర్యానీ డబ్బులు అడిగినందుకు హత్య..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: June 6, 2018, 2:46 PM IST
  • Share this:
కోల్‌కతా: హోటల్‌లో కడుపు నిండా బిర్యానీ తిన్నారు.  డబ్బులు అడిగినందుకు హోటల్ యజమానిని తుపాకీతో కాల్చిచంపారు.  పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి నలుగురు కస్టమర్లు హోటల్‌లో బిర్యానీ తిన్నారు. బిల్లు కట్టే విషయంలో షాపు యజమాని సంజయ్ మోండల్‌తో  గొడవ తలెత్తింది. ఒక్కో బిర్యానీకి 190 రూపాయలు కట్టాటలని యజమాని అడగడంతో.. ధర విషయమై వాగ్వాదం జరిగింది.  ఈ క్రమంలోనే నలుగురు కస్టమర్లలో ఒకరు హోటల్ యజమానిని తుపాకీతో కాల్చి..అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన సంజయ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా .. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు కోసం గాలిస్తున్నారు. బిర్యానీ ధర విషయంలో గొడవ తలెత్తినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఫిరోజ్ అనే వ్యక్తి సంజయ్‌ను కాల్చినట్లు అతని సోదరుడు పోలీసులకు చెప్పాడు. ఆ నలుగురు వ్యక్తుల పేర్లు రాజా, ఫిరోజ్, మోగ్రీ, సల్మాన్ అని వెల్లడించారు. వాళ్లంతా రౌడీలని పేర్కొన్నాడు. ఈ ఘటనతో తమ కుటుంబమంతా తీవ్ర భయాందోళనకు గురయిందని.. ఇలాంటి పరిస్థితుల్లో తమ వ్యాపారాన్ని ఎలా నడుపుకోవాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం  చేశాడు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2018, 6:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading