Home /News /national /

Bengal Elections: నేడు మమతా బెనర్జీ ధర్నా.. మరింత హీటెక్కనున్న బెంగాల్ పాలిటిక్స్

Bengal Elections: నేడు మమతా బెనర్జీ ధర్నా.. మరింత హీటెక్కనున్న బెంగాల్ పాలిటిక్స్

నేడు మమతా బెనర్జీ ధర్నా (File)

నేడు మమతా బెనర్జీ ధర్నా (File)

West Bengal Assembly Elections 2021: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో... ఆమె ధర్నాకు దిగుతున్నారు.

    Bengal Assembly Elections 2021: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు సహజంగా ధర్నాలు చెయ్యరు. రోడ్డుపైకి రారు. కానీ... బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీరు వేరు. ఆమె రెగ్యులర్‌గా పాదయాత్రలు చేస్తారు. రోడ్లపై నడుస్తూ... జనాన్ని తన వెంట నడిపిస్తూ... తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది బీజేపీ. అందుకు అంతే దీటుగా స్పందిస్తూ దీదీ... ప్రజల్లో తనకు మద్దతు తగ్గకుండా ఉండేందుకు ఎన్ని వ్యూహాలు రచించాలో అన్నీ రచిస్తున్నారు. తాజాగా ఆమె ధర్నాకు దిగాలని నిర్ణయించుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమే.

    294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 4 దశలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 17న ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లంతా టీఎంసీకి ఓటు వేయాలని ఎన్నికల ప్రచార సభలో మమత పిలుపునిచ్చారు. దీంతో మతపరంగా ఓట్లు అడుగుతున్నారంటూ... మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని నిరసిస్తూ... బీజేపీ నేతల బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో... ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినందుకు 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించినట్టు ఈసీ తెలిపింది. మంగళవారం (13-4-2021) రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని చెప్పింది.

    ఈసీ నిషేధ ఆదేశంపై మమతా బెనర్జీ ట్విట్టర్‌‌లో స్పందించారు. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా 13-4-2021 (నేడు) మధ్యాహ్నం కోల్‌కతాలో ధర్నాకు దిగనున్నట్టు చెప్పారు. ‘భారత ఎన్నికల సంఘం అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయానికి నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కోల్‌కతాలోని గాంధీ మూర్తి వద్ద ధర్నా చేపడతాను’అని మమతా బెనర్జీ తెలిపారు.


    గత వారం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం 2 నోటీసులను జారీచేసింది. మార్చి 28, ఏప్రిల్ 7న మమతా బెనర్జీ చేసిన ప్రసంగాలకు సంబంధించి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. దీనిపై మమతా బెనర్జీ ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. మమత వివరణను పరిశీలించిన ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మమతా బెనర్జీ 24 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా ఉత్తర్వులు జారీచేశారు. ఐతే... సునీల్ అరోరా ప‌ద‌వీకాలం నేటితో ముగుస్తోంది. ఆయన స్థానంలో సుశీల్ చంద్ర (sushil chandra) ఇవాళ బాధ్యతలు తీసుకుంటారు.

    ఇది కూడా చదవండి: Ugadi Panchangam: ఉగాది వార్షిక రాశి ఫలాలు.. ప్లవ నామ సంవత్సరం ఎలా ఉంటుంది?

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఏప్రిల్ 29న ఉంది. మే 2న ఫలితాలు రానున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: 5 State Elections, Mamata Banerjee, West Bengal Assembly Elections 2021

    తదుపరి వార్తలు