Bengal Assembly Elections: మమత మేనల్లుడిని టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ...

మమత మేనల్లుడిని టార్గెట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... (image credit - twitter)

Bengal Assembly Elections 2021: ఈసారి బెంగాల్‌లో తప్పకుండా అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కమలంతో కుస్తీకి దీదీ కూడా గట్టిగానే పోరాడుతున్నారు.

 • Share this:
  Bengal Assembly Elections 2021: ఎత్తుకు పైఎత్తులతో బెంగాల్ దంగాల్ అదిరిపోతోంది. వంగ దేశంలో ఎప్పుడూ లేనంత హీట్ ఇప్పుడు ఉంది. ప్రధానంగా... లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలను కొల్లగొట్టి బీజేపీ... అప్పుడే అధికార తృమమూల్ కాంగ్రెస్ పని అయిపోయిందని డిసైడైనట్లు కనిపిస్తోంది. అందుకే.. ఈసారి కచ్చితంగా అధికారం తమదేనని ఘంటాపథంగా చెబుతోంది. దానికి తగ్గట్టే కమల ప్రచార హోరు కూడా ఓ రేంజ్‌లో ఉంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రచారంలో పాల్గొనలేదు. కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఆయనది. అది జగన్ స్టైల్. బీజేపీ అలా కాదు... తమ పాలన గురించి ప్రజలకు తెలుసు అంటూనే... కమల దళం మొత్తం బెంగాల్‌లో దిగింది. వన్ బై వన్ బడా నేతలంతా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీని బాగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బెంగాల్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం... పదునైన విమర్శలతో దీదీకి మంట పుట్టిస్తున్నారు.


  కేంద్రంలో అవినీతి లేదు కాబట్టి... బెంగాల్ దీదీ పాలనలో అవినీతిపైనే ఫోకస్ చేయడం ద్వారా తాము విజయం సాధించగలం అని బీజేపీ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే... మమత మేనల్లుడు తెరవెనక చక్రం తిప్పుతున్నాడని పదే పదే ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఖరగ్‌పూర్‌ ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం... మరోసారి దీదీ మేనల్లుడినే టార్గెట్ చేశారు. బెంగాల్‌లో ఏకైక సింగిల్ విండో ఉందన్న ఆయన... అది భాయ్‌పో (మేనల్లుడు) అన్నారు. ఆ విండోని దాటకుండా ఏ పనీ జరగదంటూ... అవినీతికి పాల్పడుతున్నారనే పరోక్ష విమర్శలు చేశారు.


  తాము అధికారంలోకి వచ్చి... బెంగాల్ ప్రజలతో ఆడుకుంటున్న మమతా అండ్ కో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆటలకు చెక్ పెడతామని మోదీ అన్నారు. "ఆట ముగుస్తుంది... అభివృద్ధి మొదలవుతుంది" అని మోదీ అనడంతో... ఆ సభకు భారీగా వచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులూ... అదే నినాదం అందుకొని... పదే పదే అనడం ప్రారంభించారు.

  కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్ ప్రజలకు చేరకుండా మమతా బెనర్జీ ఓ గోడలా అడ్డుపడుతున్నారని మోదీ విమర్శాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ పాలనలో వ్యవసాయం, నీటి పారుదల, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. ఆరోగ్య రంగాన్ని పెంచుతామనీ... గ్రామాలకు రోడ్లను వేస్తామనీ... బెంగాల్‌లో ప్రతీ ఇంటికీ శుభ్రమైన మంచి నీరు అందిస్తామని హామీలు ఇచ్చారు.

  చంద్రబాబుపై వైసీపీ ఫైర్-

  బెంగాల్‌లో ప్రధాని మోదీ మూడో ర్యాలీ ఇది. ఇటు మోదీ, అటు మమతా ఇద్దరూ అగ్గిమీద గుగ్గిలంలా చిటపడలాడుతున్నారు. మాటల యుద్ధం సరిహద్దులు దాటుతోంది.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారికి ఒకరంటే ఒకరికి పడదు... దూరంగా ఉండటమే మేలు

  బెంగాల్ అసెంబ్లీకి 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27 తొలి విడతలో 1 నుంచి 30 నియోజక వర్గాలకు పోలింగ్ జరగనుంది. 2వ దశలో ఏప్రిల్ 1న 30 నియోజకవర్గాలకు జరగనుంది. మూడో దశలో 31 సీట్లకు ఏప్రిల్ 6న, 4వ దశలో 44 స్థానాలకు ఏప్రిల్ 10న, 5వ దశలో 45 స్థానాలకు ఏప్రిల్ 17న, ఆరో దశలో 43 సీట్లకు ఏప్రిల్ 22న, ఏడో దశలో 36 సీట్లకు ఏప్రిల్ 26న, 8వ దశలో 35 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది.
  Published by:Krishna Kumar N
  First published: