Home /News /national /

Bengal Elections: ఎన్నికల సంఘానికి కొత్త పేరు పెట్టిన మమతా బెనర్జీ... BJPపై సెటైర్

Bengal Elections: ఎన్నికల సంఘానికి కొత్త పేరు పెట్టిన మమతా బెనర్జీ... BJPపై సెటైర్

ఎన్నికల సంఘానికి కొత్త పేరు పెట్టిన మమతా బెనర్జీ (image credit - twitter)

ఎన్నికల సంఘానికి కొత్త పేరు పెట్టిన మమతా బెనర్జీ (image credit - twitter)

West Bengal Assembly Elections 2021: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఐదో దశకు చేరగానే... మమతా బెనర్జీ దూకుడు మరింత పెంచారు. డైరెక్టుగా ఎన్నికల సంఘాన్నే టార్గెట్ చేశారు.

  Bengal Assembly Elections 2021: 294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 4 దశలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశలు జరగాల్సి ఉంది. ఇప్పటికే... అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య అమీ తుమీ నడుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా బీజేపీని బలంగా ఎదుర్కొంటున్న తృమమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఎన్నికల సంఘం (election commission- EC)... బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని డైరెక్టుగా ఆరోపణలు చేస్తున్నారు. తాజా ట్వీట్‌లో మరింత ఘాటుగా స్పందించారు. ఈసీ పేరు మార్చి MCC అని పెట్టుకోవడం బెటర్ అన్నారు. MCC అంటే మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్ అని సెటైర్ వేశారు.

  "బీజేపీ తన బలమంతా ప్రయోగించవచ్చు... కానీ ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ ఆపలేరు, నా ప్రజలకు నన్ను దూరం చెయ్యలేరు. వారి బాధను నాతో పంచుకోనివ్వకుండా చెయ్యలేరు. కూచ్ బెహర్‌లో నా సోదర సోదరీమణులను నేను 3 రోజులు కలవకుండా నా ప్రత్యర్థులు నన్ను ఆపవచ్చు... కానీ... నాలుగో రోజు నేను అక్కడ ఉంటా" అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.


  మమతా బెనర్జీ ఈ ట్వీట్ పెట్టడానికి ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశమే. శనివారం... కూచ్ బెహర్ జిల్లా (Cooch Behar district)లో జరిగిన హింసలో నలుగురు చనిపోవడంతో... ఈసీ... 3 రోజులపాటూ... ఆ జిల్లాలోకి రాజకీయ నేతలెవరూ వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది.

  ఏప్రిల్ 17న బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొదట 48 గంటలే నిషేధం విధించిన ఈసీ... తర్వాత దాన్ని 72 గంటల (3 రోజులు)కు పెంచింది. దీని వల్ల ఇంకా అక్కడ ప్రచారం చేయడానికి నిషేధం తర్వాత 2 రోజులు మాత్రమే ఛాన్స్ ఉంటుంది.

  ఈసీ నిషేధం కారణంగా... అక్కడికి వెళ్లాలనుకున్న తృణమూల్ కాంగ్రెస్ ప్లాన్ బెడిసికొట్టింది. దాంతో... ఆ హింసా ఘటనను వ్యతిరేకిస్తూ... నల్ల బ్యాడ్జిలతో ధర్నా చెయ్యాలని తృణమూల్ కార్యకర్తలు ప్లాన్ వేసుకున్నారు.

  కూచ్ బెహర్‌లో ఏం జరిగింది?
  ఓ పోలింగ్ కేంద్రం బయట ఘర్షణలు జరిగాయి. స్థానిక మూకలు... సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశాయి. ఓ అపార్థం కారణంగా ఇలా చేశాయి. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్... CISF... కాల్పులు జరిపారు. దాంతో... నలుగురు చనిపోయారు. ఈ విషయంలో సెక్యూరిటీ దళాలనే తప్పుపడుతున్న తృణమూల్ కాంగ్రెస్... స్థానికులకు మద్దతుగా ప్రభుత్వం ఉంటుందని చెప్పింది.

  ఇది కూడా చదవండి: Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశుల వారికి అనుకూల గ్రహ సంచారం

  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఏప్రిల్ 29న ఉంది. మే 2న ఫలితాలు రానున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: 5 State Elections, Mamata Banerjee, West Bengal Assembly Elections 2021

  తదుపరి వార్తలు