Bengal Assembly Elections 2021: 8 దశల్లో జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్... హోరాహోరీ ప్రచారం చేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నాయి. ఈ క్రమంలో... మూడో దశ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... "దీదీ ఓ దీదీ" అనే స్వరం అందుకున్నారు. మాటకు ముందు... మాటకు తర్వాత... ఇదే పలుకుతూ... తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. దాంతో దీదీ ఓ దీదీ అనే ట్యాగ్ లైన్ దూసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి బీజేపీ నేతలంతా ఇదే వాయిస్ అందుకున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా... దీదీ ఓ దీదీ అంటూ... మమతకు మంటెక్కేలా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఓ వివాదంలో FIRలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు రాశారు.
ఉత్తర కోల్‌కతాలో... అంహెరెస్ట్ స్ట్రీట్ (Amherst Street) పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడి పోలీసులు ఇద్దరు అవారాగాళ్లను తీసుకొచ్చి జైల్లో తోశారు వారిపై కేసు రాశారు. వాళ్లు ఏం చేస్తున్నారంటే... అమ్మాయిల వెంట పడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాయిస్‌తో దీదీ ఓ దీదీ అంటూ... ఈవ్ టీజింగ్ చేస్తున్నారు. బెంగాల్ అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇలాంటి ఆవారాల పని పట్టడంలో వాళ్లు ఏమాత్రం వెనకడుగు వెయ్యట్లేదు. వెంటనే పోలీసులకు కాల్ వెళ్లిపోయింది. వాళ్లు రావడం... గాలోళ్లను పట్టుకుపోవడం జరిగిపోయాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎందుకు?
ఈ మొత్తం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును FIRలో రాశారు గానీ... దీనికీ మోదీకి ఏమాత్రం సంబంధం లేదు. ఆ పేరు ఎందుకంటే... ఈ గాలోళ్లు... ఇలా నరేంద్ర మోదీ చేసిన ప్రచారంలోని దీదీ ఓ దీదీ అనే పదాన్ని ఉపయోగిస్తూ... అమ్మాయిలను టీచ్ చేస్తున్నారు అని FIR కాపీలో రాశారు. ఆ క్రమంలో మోదీ పేరు రాయాల్సి వచ్చింది. ఐతే... తాను వేసిన సెటైరికల్ డైలాగ్ దీదీ ఓ దీదీ ఇంతలా పేలుతుందనీ... చివరకు అది వివాదాస్పదం కూడా అవుతుందని ఆ క్షణం మోదీ ఆలోచించివుండరు.
Speaking at a massive rally in Bardhaman. https://t.co/PF05LCuYww
— Narendra Modi (@narendramodi) April 12, 2021
దీదీ అంటే అక్క అని అర్థం. మమతా బెనర్జీని ఆమె మద్దతు దారులు దీదీ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మమతా బెనర్జీ కూడా వారితో అలా కలిసిపోయారు. ఆ క్రమంలో దేశం మొత్తం ఆమెను దీదీ అని పిలుస్తోంది. ప్రధాని మోదీ కూడా దీదీ అని పిలుస్తూనే ఆయనది ప్రత్యర్థి పార్టీ కాబట్టి... ఎన్నికల్లో విమర్శలు, ఆరోపణలు కామన్‌గా చేస్తున్నారు. అంతే తప్ప... ఆమెను కించపరిచే ఉద్దేశంతో కాదు. కానీ... ఇలాంటి పోకిరీలు మాత్రం... దీన్ని సాకుగా చూపిస్తూ... అమ్మాయిలను ఏడిపిస్తే... తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Banana in Fridge: అరటిపండును ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదు? అది తింటే ఏమవుతుంది?
294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 4 దశలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు దశలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 17న బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఏప్రిల్ 29న ఉంది. మే 2న ఫలితాలు రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Narendra modi, West Bengal Assembly Elections 2021