Home /News /national /

Bengal Elections: బెంగాల్‌లో 4వ దశ పోలింగ్... మమతా బెనర్జీకి మళ్లీ ఈసీ నోటీస్...

Bengal Elections: బెంగాల్‌లో 4వ దశ పోలింగ్... మమతా బెనర్జీకి మళ్లీ ఈసీ నోటీస్...

బెంగాల్‌లో 4వ దశ పోలింగ్... మమతా బెనర్జీకి మళ్లీ ఈసీ నోటీస్... (image credit - PTI)

బెంగాల్‌లో 4వ దశ పోలింగ్... మమతా బెనర్జీకి మళ్లీ ఈసీ నోటీస్... (image credit - PTI)

West Bengal Assembly Elections 2021: బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా... ఇప్పటికే 3 దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ అప్‌డేట్స్ తెలుసుకుందాం.

  Bengal Assembly Elections 2021: 294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 4వ దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ విడతలో మొత్తం 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హౌరా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ సహా ఉత్తర బెంగాల్‌లోని రెండు జిల్లాల్లోని కోటి 15 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. కేంద్ర మంత్రులు బాబుల్ సుప్రియో, ఇద్దరు బీజేపీ ఎంపీలు, ఇద్దరు బెంగాల్ మంత్రులు పార్థ చటర్జీ, అరూప్ బిశ్వాస్ సహా ఉద్ధండులు ఈ విడుతలో పోటీ పడుతున్నారు. మొత్తం 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 15,940 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. మొత్తం 789 కంపెనీల కేంద్ర బలగాలు సెక్యూరిటీ కల్పిస్తున్నాయి. సాయంత్రం 6.30 వరకూ పోలింగ్ జరగనుంది.

  మమతకు ఈసీ నోటీసులు:
  బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఎంత రచ్చ చేస్తే అంత మేలు జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్లాన్ వేస్తున్న దీదీ... ఫ్రాక్చర్ అయిన కాలును పదే పదే చూపిస్తూ... సెంటిమెంట్ అస్త్రంతో ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ... ఓటర్లను భయపెట్టి... ఓట్లు వేయించుకుంటోందని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు ఈసీని కలిశారు. మమతపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారంటూ... దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇందుకు 11 గంటల టైమ్ ఇచ్చింది. ఆ టైమ్ ఇవాళ్టితో ముగియనుంది. కానీ మమతా బెనర్జీ వివరణ ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ నోటీసులను తాను లెక్క చేయబోనని ఆమె చెప్పారు.


  బీజేపీదే విజయమా:
  ఓవైపు సర్వేలు మళ్లీ తృణమూల్ కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పగా బీజేపీ మాత్రం పదే పదే తామే గెలుస్తున్నామని జోరుగా ప్రచారం చేస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ఇప్పటివరకూ జరిగిన 91 సీట్ల పోలింగ్‌లో బీజేపీ 63 నుంచి 38 స్థానాలు గెలుస్తుందని అన్నారు. తద్వారా... తామే అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు ఇస్తున్నారు. మరి ఓటర్లు ఎవరివైపు ఉన్నారన్నది తేలాల్సిన అంశం.

  ఇది కూడా చదవండి:Horoscope today: నేటి రాశి ఫలాలు... చేస్తున్న ప్రయత్నాలు కొనసాగిస్తే సత్ఫలితాలు

  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఏప్రిల్ 29న ఉంది. మే 2న ఫలితాలు రానున్నాయి.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: 5 State Elections, West Bengal Assembly Elections 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు