అమ్మాయిలకు వరం 'సుకన్య సమృద్ధి యోజన'!

సుకన్య సమృద్ధి యోజన కూతురు ఉన్న తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అందించిన వరం. మరి ఆ స్కీమ్‌ వివరాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 9, 2018, 1:05 PM IST
అమ్మాయిలకు వరం 'సుకన్య సమృద్ధి యోజన'!
సుకన్య సమృద్ధి యోజన కూతురు ఉన్న తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అందించిన వరం. మరి ఆ స్కీమ్‌ వివరాలేంటో తెలుసుకోండి.
  • Share this:
బాలికల సంక్షేమానికి, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే 'సుకన్య సమృద్ధి యోజన'. 'భేటీ బచావో భేటీ పడావో' నినాదాన్ని వినిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది.

'సుకన్య సమృద్ధి యోజన' పథకం ఎవరికి?

పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవచ్చు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పదేళ్ల వయస్సు గల ఆడపిల్లల పేరుపైనే అకౌంట్ తెరిచే అవకాశముంది.

అకౌంట్ ఎక్కడ తెరవాలి?
సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లను దేశంలోని అన్ని ప్రముఖ బ్యాంకులతో పాటు పోస్ట్‌ ఆఫీసుల్లో తెరవచ్చు. ఒకరు ఇద్దరు కూతుళ్ల పేర్ల పైనే అకౌంట్లు మాత్రమే తెరిచేందుకు అవకాశముంది. ఒకవేళ మొదటి లేదా రెండో కాన్పులో కవల ఆడపిల్లలు పుట్టినవారు మూడు అకౌంట్లు తెరవచ్చు. మీరు ఏ బ్యాంకుకైనా అకౌంట్ మార్చుకోవచ్చు.

ఖాతా తెరవడానికి ఏం కావాలి?
బాలిక రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్, తండ్రి లేదా సంరక్షకుడి చిరునామా, ఇతర గుర్తింపు పత్రాలు తప్పనిసరి.కనీసం ఎంత జమ చేయాలి?
నెల నెలా ఆర్థిక స్థోమతను బట్టి రూ.250 నుంచి రూ.1,50,000 వరకు జమ చేయొచ్చు. అకౌంట్ ప్రారంభించిన 15 ఏళ్ల వరకు డిపాజిట్లు చేయొచ్చు. క్యాష్, చెక్, డీడీ, ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్స్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఆలస్యంగా చెల్లిస్తే రూ.50 జరిమానా విధిస్తారు.

వడ్డీ చెల్లింపు విధానమేంటీ?
ప్రతీ ఏటా మీరు జమ చేసిన మొత్తంపై చక్రవడ్డీ వస్తుంది. ప్రతీ ఏడాది వడ్డీ రేట్లు మారుతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే చక్రవడ్డీ లెక్కిస్తారు. ఈ పథకం ప్రారంభించినప్పుడు వడ్డీ రేటు ఏటా 9.1 శాతం ఉండేది. ప్రస్తుతం 8.1 శాతం ఉంది.

లాభాలేంటీ?
ఈ పథకంలో చేరినవారికి ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి. జమ చేసిన డబ్బుతో పాటు వడ్డీ, విత్‌డ్రా చేసుకున్న నగదుపై సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు.

జమ చేసిన డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
ఒక్కసారి ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ అమ్మాయికి 18 ఏళ్ల వయస్సులో చదువులకు, పెళ్లికి అవసరమైతే అప్పటివరకు జమ అయిన మొత్తంలో 50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

ముందస్తుగా అకౌంట్ క్లోజ్ చేయొచ్చా?
డిపాజిటర్ చనిపోయినా లేక ప్రాణాంతక వ్యాధులతో బాధపడే సందర్భంలో అకౌంట్ క్లోజ్ చేయొచ్చు.

పూర్తి వివరాలు ఎక్కడ ఉంటాయి?
మీ దగ్గర్లోని పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి కనుక్కోవచ్చు. లేదా www.nsiindia.gov.in లో వివరాలు తెలుసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: August 9, 2018, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading