Rape on cows : పాలిచ్చే ఆవులపై దుర్మార్గం.. భరించలేక అమ్ముకుంటున్న రైతులు.. చివరికి రైతులంతా ఇలా చేశారు... !

గిర్ జాతి ఆవులు (image credit - wikipedia)

Rape on cows : పాలిచ్చే ఆవులపై(cow) అత్యాచారం (rape)చేస్తున్న ముఠా ఆగడాలు భరించలేక రైతులు వారి ఆవులను అమ్ముకుంటున్నారు. ఆవులను విచక్షణ రహితంగా కొడుతూ తీవ్ర హింసకు గురి చేస్తున్నవారిని పట్టుకోవాలంటూ పోలీసులకు(police) సైతం ఫిర్యాదు చేశారు.

 • Share this:
  కొంతమంది సైకోగాళ్లు మహిళలలనే కాదు.. పాలిచ్చే ఆవులను కూడా వదలడం లేదు.. అర్థరాత్రి ఇంటిముందు కట్టెసి పెట్టిన ఆవులపై దారుణాలకు పాల్పడుతున్నారు. వాటిని విచక్షణరహితంగా కొట్టి పైశాచిక అనందాన్ని పొందుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఆవులపై అత్యాచారం చేస్తూ.. ఎవరికి చిక్కకుండా తిరుగుతున్న ముఠాపై స్థానిక రైతులు ఆందోళన చెందడంతో పాటు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఆవులను ఇతరులకు అమ్మెందుకు సిద్దమయ్యారు. మరోవైపు జరుగుతున్న సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన ఘటన కేరళలో (kerala)చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా మయనాడ్ రైతులు తమకు చెందిన పాలిచ్చే ఆవులను అమ్ముకుంటున్నారు. ఇందుకు కారణం వాటిపై అత్యాచారం జరగడమే.. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియక వాటిని జీవనాధారం కోసం పెంచుకుంటున్నా ఆవులను అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా 2021 నుండి సుమారు ఇరమైమంది రైతులకు చెందిన ఆవులపై అత్యాచారం జరిగింది. అయితే ఈ అత్యాచారం విషయం ముందుగా రైతులకు తెలియక తికమక పడ్డారు. స్థానికంగా సీసీ కేమెరాలను(cc camera) ఏర్పాటు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

  ఇది చదవండి : నువ్వెంత అంటే.. నువ్వెంత.. ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య మాటల యుద్దం.. సర్పంచ్ రాజీనామా.. ఇంతకి వివాదం ఏంటి..!


  నిందితులు ఆవులపై అత్యాచారం చేయడంతో పాటు వాటిని విచక్షణ రహితంగా కొట్టడం వాటి పాలిచ్చే పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చడంతోపాటు వాటి జననాంగాల్లో కూడా కట్టెలు పెట్టడం లాంటి నీచమైన పనులకు దిగడం చూశారు. ఈ క్రమంలోనే ఏడు ఆవులున్న ఓ రైతు ఏకంగా ఆ బాధలు భరించలేక ఐదింటిని అమ్ముకున్నాడట.. అయితే వ్యక్తిగతంగా ఎవరో కక్షగట్టి ఇలా చేస్తున్నారని భావించిన రైతుకు ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఇలా ఒక్క రైతుకు చెందిన ఆవులనే కాదు.. ఆ గ్రామంలోని మరో ఇరవైమందికి చెందిన ఆవులపై కూడా ఇలాగే అత్యాచారం జరిగిందని చెబుతున్నారు.

  దీంతో వారంతా కలిసి ఓ రోజు నిందితున్ని పట్టుకున్నారు. అనంతరం వాడిని స్థానిక పోలీసులకు (police)అప్పగించారు. అయితే ఆవులపై అత్యాచారం చేస్తున్న నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా నోరు లేని పశులపై ఇలా చేయడం పై ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

  ఇది చదవండి : మరుగు మందుకోసం ఊళ్లో గబ్బిలాల వేట.. అసలు మరుగు మందు అంటే ఏంటీ.. ?

  Published by:yveerash yveerash
  First published: