Home /News /national /

BEATING ALL ODDS VISUALLY CHALLENGED GIRL FROM KERALA TOPS CLASS 12 WITH 496 OUT OF 500 MARKS PVN

Visually Challenged Girl : చూపు లేకున్నా చుక్కాని అయింది..500కు 496 మార్కులతో ఫస్ట్ ర్యాంక్

హన్నా ఆలిస్ సైమన్

హన్నా ఆలిస్ సైమన్

Kerala Blind Girl Gets First Rank In Class 12 : సాధించాలన్న తపన ఉంటే చాలు ఛేదించలేనిది ఏది లేదు. దీన్ని నిజం చేస్తూ ఓ విద్యార్థిని అంగవైకల్యాం ఉన్నా వెనకడుగు వేయకుండా ముందుగు సాగి విజయం సాధించింది. చదువులో ఆ విద్యార్థిని అందరికీ ఆదర్శం.

ఇంకా చదవండి ...
Kerala Blind Girl Gets First Rank In Class 12 : సాధించాలన్న తపన ఉంటే చాలు ఛేదించలేనిది ఏది లేదు. దీన్ని నిజం చేస్తూ ఓ విద్యార్థిని అంగవైకల్యాం ఉన్నా వెనకడుగు వేయకుండా ముందుగు సాగి విజయం సాధించింది. చదువులో ఆ విద్యార్థిని అందరికీ ఆదర్శం. పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేనప్పటికీ(Blind) చదువులో విశేష ప్రతిభ చూపింది. అందరిలా ఈ ప్రపంచాన్ని చూడలేకపోయినా తాను ఎవరికీ తక్కువ కాదని నిరూపించింది. మైక్రోఫ్తాల్మియా కారణంగా చిన్నతనంలోనే అంధత్వానికి గురైన కేరళ(Kerala)కు చెందిన హన్నా ఆలిస్ సైమన్(Hannah Alice Simon) ఇటీవల సీబీఎస్ఈ(CBSE) విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో దివ్యాంగుల కేటగిరిలో 500కు... 496 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించి ఔరా అనిపించింది. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోసం సైకాలజీని అభ్యసించడానికి ఆమెకు ఇప్పుడు పూర్తి స్కాలర్‌షిప్ లభించింది.

తనకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో హన్నా ఆనందానికి అవధులు లేకుంగా పోయాయి. ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్న ఆమె... ఈ విజయానికి తన తల్లిదండ్రులే కారణమని, అందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొంది. స్పెషల్ స్కూల్(బ్లైండ్ స్కూల్‌) లో కాకుండా నార్మల్ స్కూల్లో చదివించడం వల్లే తాను ఇవాళ చదువులో రాణిస్తున్నానని చెప్పుకొచ్చింది. రాజగిరి క్రీస్తు జయంతి పబ్లిక్ స్కూల్‌లో హన్నా విద్యనభ్యసించింది. అంధురాలిగా పుట్టడం వల్ల చాలామంది చాలా రకాలుగా అవమానించారని, అయితే అవే ఇవాళ తన విజయానికి కారణమయ్యాయని స్పష్టం చేసింది. చిన్నతనంలో స్కూల్‌లో ఇతర విద్యార్థులు తనను హేళన చేసేవారని, వేధించే వారని, దూరంగా పెట్టేవారని, అయితే తాను అవేమీ పట్టించుకోలేదని హన్నా చెబుతున్నారు.

Viral Video : ఇంట్లోని బంగారం తీసుకొని ప్రియుడితో భార్య జంప్..టవర్ ఎక్కిన భర్త



చిన్నతనంలో ఇటువంటి వాటిని ఎదుర్కోవడం వలన జీవితంలోని పెద్ద సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని ఇచ్చింది అని హన్నా తెలిపారు. చదువులోనే కాకుండా సింగర్, మ్యూజిక్ కంపోజర్, యూట్యూబర్, మోటివేషనల్ స్పీకర్ గా హన్నా బహుముఖ ప్రతిభ కనబరుస్తోంది. హన్నా తన యూట్యూబ్ ఛానెల్‌లో తన మ్యూజిక్ వీడియోలు, ప్రేరణాత్మక ప్రసంగాలను పంచుకుంటుంది. . జూలై 15, 2022న హెన్నా తన మొదటి పుస్తకం వెల్‌కమ్ హోమ్ ని విడుదల చేసింది. పుస్తకం ఆరుగురు అమ్మాయిల కథను వివరిస్తుంది. పుస్తక ఆవిష్కరణ నిజంగా ప్రత్యేకమైనదని, లాక్‌డౌన్ సమయంలో తాను దాని కోసం పనిచేశానని. ఇది ఆరుగురు అమ్మాయిల కథ అని హన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Cbse results, Kerala

తదుపరి వార్తలు