రెండునెలల చిన్నారిని ఎలుకల మధ్య వదిలిన తల్లి... 12ఏళ్ల తర్వాత గుర్తొచ్చి

2009లో భార్యభర్తలిద్దరి మధ్య ఏదో విషయమై గొడవ చోటు చేసుకుంది. దీంతో నసీమా భర్తపై కోపంతో రెండు నెలల చిన్నారిని గదిలో బంధించి పుట్టింటికి వెళ్లిపోయింది.

news18-telugu
Updated: July 14, 2019, 11:37 AM IST
రెండునెలల చిన్నారిని ఎలుకల మధ్య వదిలిన తల్లి... 12ఏళ్ల తర్వాత గుర్తొచ్చి
నమూనా చిత్రం
news18-telugu
Updated: July 14, 2019, 11:37 AM IST
తన ప్రాణం పోయిన తన కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాల్ని మాత్రం కంటికి రెప్పాలా కాపాడేందకు కన్నతల్లి ప్రతిక్షణం పరితపిస్తోంది. కానీ ఓ కసాయి తల్లి మాత్రం తన రెండు నెలల బిడ్డను ఎలుకల మధ్య వదిలి వెళ్లిపోయిన ఘటన యూపీలో జరిగింది. పదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ బరేలీ ప్రాంతానికి చెందిన నసీమా అనే మహిళకు.. వికార్ మెహందీ అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ బాబు కూడా పెట్టారు. 2009లో భార్యభర్తలిద్దరి మధ్య ఏదో విషయమై గొడవ చోటు చేసుకుంది.

దీంతో నసీమా భర్తపై కోపంతో రెండు నెలల చిన్నారిని గదిలో బంధించి పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్నారి ఉన్న గదినిండా ఎలుకలు ఉండటంతో ... అవి పసికందును కరవడం మొదలుపెట్టాయి. దీంతో ఆ చిన్నారి ఏడుపు విన్నఇరుగు పొరుగు అక్కడకు చేరుకున్నారు. పక్కింటి మహిళ అయిన రఫికాన్ వెంటనే అక్కడకు చేరుకుంది. ఇరుగు పొరుగు సాయంతో గది తలుపులు పగులగొట్టి పసికందును రక్షించారు. అప్పటికే గాయపడిన చిన్నారిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఇక అప్పట్నుంచి చిన్నారి రఫికాన్ వద్ద ఉంటున్నారు. ఆమె పసివాడిని తన కన్నబిడ్డలా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది.  ఇదంతా 10 ఏళ్లక్రితం జరిగిన సీన్.

ఇప్పుడు ఆ చిన్నారికి పదేళ్లు. పేరు తౌహీద్ అహ్మద్. స్థానిక పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. చాలా సరదాగా సంతోషంగా ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత కన్నబిడ్డ గుర్తుకురావడంతో.. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బిడ్డ తనకు కావాలంటూ పోలీసుల్ని కోరింది. దీంతో రఫికాన్ ఇంటికి వెళ్లిన పోలీసులకు పదేళ్ల కిందట జరిగన సీన్ తెరపైకి వచ్చింది, పోలీసుల విచారణలో తల్లి ఎలుకలు ఉన్న గదిలో చిన్నారిని వదిలి వెళ్లిపోయినట్లు తేలింది. దీంతో బాబు కూడా తన సొంత తల్లి వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నాడు. పెంపుడు తల్లి రఫికాన్ వద్దే తాను సంతోషంగా ఉన్నానని అంటున్నాడు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...