Partho Dasgupta: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తా

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తా (File Image)

Partho Dasgupta: అసలు పార్థో దాస్‌గుప్తాకి ఏమైంది? ఆయనకు వచ్చిన అనారోగ్యమేంటి? ఎందుకు పోలీసులు ఈ విషయంపై లోతుగా ఆలోచిస్తున్నారు? తెలుసుకుందాం.

 • Share this:
  Partho Dasgupta: బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) మాజీ సీఈఓ పార్థో దాస్‌ గుప్తా (Partho Dasgupta) అనారోగ్యంతో జేజే ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు గత రాత్రి బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో... కిందపడిపోయారు. దాంతో మహారాష్ట్ర లోని తలోజా జైలు అధికారులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. ఆయన భార్య సామ్రాజ్ఞి దాస్‌గుప్తా చెప్పినదాని ప్రకారం... ఆయన్ని ఈ రోజు ICUకి తరలించినట్లు తెలిసింది. పార్థో ప్రస్తుతం డాక్టర్లు చెప్పేదానికి స్పందించట్లేదు, అలాగే ఆయన ఏదీ మాట్లాడట్లేదని తెలుస్తోంది. ఆయన బ్లడ్ షుగర్ పేషెంట్ కావడంతో... రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు లోనైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందని సామ్రాజ్ఞి దాస్ గుప్తా చెబుతున్నారు.

  TRP స్కామ్‌లో ఆరోపణలు:
  ఒక్క ఛానెల్‌కి రేటింగ్స్ పెంచడం కోసం CNN-న్యూస్ 18 సహా చాలా ఛానెళ్ల రేటింగ్స్ తగ్గిస్తూ... టీఆర్పీ రేటింగుల ట్యాంపరింగ్‌కి పార్పడినట్లు పార్థో దాస్‌ గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. ముంబై పోలీసులు ఆయన్ని గతేడాది డిసెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు. ఆయన డిసెంబర్ 31 వరకూ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

  దాస్ గుప్తా... 2013-2019 మధ్య బార్క్ సీఈఓగా పనిచేశారు. ఈ కేసులో ఈయనది 15వ అరెస్టు. దాస్ గుప్తా కొన్ని ఛానెళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP)ని కావాలనే రిగ్గింగ్ చేసి... తగ్గించేసినట్లు ఆరోపణలు భగ్గుమన్నాయి. ప్రధానంగా ఒక్క న్యూస్ ఛానెల్ కోసం మిగతా ఛానెళ్ల రేటింగ్స్ తగ్గించేయడం అనే భారీ కుట్రకు పార్థో దాస్ గుప్తా పాల్పడినట్లు ఈ కేసులో ఆధారాలు లభించినట్లు తెలిసింది. "ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో కొన్ని విషయాలు తెలిశాయి. మాజీ ఉన్నతాధికారుల మధ్య కొన్ని ఈ మెయిల్స్, చాట్స్ జరిగాయి." అని డిసెంబర్ 25న ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. సింగ్ ఆ ఉన్నతాధికారుల మధ్య చాట్స్‌కి సంబంధించిన ఓ విషయాన్ని చదివారు. "దయచేసి ఓ వారం పాటూ ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌ కోసం కింద ఉన్న అప్‌డేట్ చూడండి. టైమ్స్ నౌ, CNN-న్యూస్ 18వి మార్చండి" అని చాటింగ్ జరిగినట్లు తెలిపారు.

  "ఆయన (దాస్ గుప్తా)... సీఈఓగా చేశారు కాట్టి... ఆయన టీఆర్పీ రేటింగ్స్‌లో మానిప్యులేషన్ చేసి ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఛానెళ్ల ఓనర్లు, విజిల్ బ్లోయర్లూ ఈ ఆరోపణలు చేశారు. థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టను 2020 జులైలో సమర్పించింది. దానిపై మేం బార్క్ (BARC)తో మాట్లాడి ఓ రిపోర్ట్ రెడీ చేసుకున్నాం" అని పరమ్ బీర్ సింగ్ తెలిపారు.

  "రిపోర్ట్ ప్రకారం 44 వారాల డేటాను విశ్లేషించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, తెలుగు ఛానెళ్లలో పరిశీలించారు. వాటి విషయంలో ఈ మానిప్యులేషన్ జరిగింది. మూడు రకాల పద్ధతుల్లో ఇది జరిగింది. కొన్ని సందర్భాల్లో రేటింగ్స్ ముందుగానే డిసైడ్ చేశారు. బార్క్ లోని కొందరు మాజీ అధికారుల పాత్ర ఇందులో ఉందని రిపోర్ట్ తెలిపింది"అని పరమ్ బీర్ సింగ్ వివరించారు. "బార్క్ మాజీ ఉద్యోగులపై దర్యాప్తు కొనసాగుతోంది. చట్ట బద్ధ సంస్థలకు బార్క్ నిర్వహణాధికారులు తమ సహకారం అందిస్తున్నారు."

  "బార్క్ లోని ప్రతి ఉద్యోగీ నియమ బద్ధంగా నడుచుకోవాలి. ఎథిక్స్ పాటించాలి. తప్పుచేస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి" అని బార్క్ ప్రతినిధి ఒకరు తెలిపారు. "మేం భారతీయులు ఏం చూస్తున్నారో సరైన రిపోర్ట్ ఇవ్వాలి. అది మా బాధ్యత." అని ఆయన తెలిపారు.

  ఇది కూడా చదవండి: Vastu Sashtra: ఆదివారం అక్కడ దీపం వెలిగించండి... మీ ఇంట ధన ప్రవాహమే

  దాస్ గుప్తాకి ముందు... బార్క్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) రామిల్ రామ్‌ఘరియా కూడా అరెస్ట్ అయ్యారు. పోలీసుల ప్రకారం... హన్సా గ్రూప్‌లోని రిలేషన్‌షిప్ మేనేజర్లు... మ్యానిప్యులేషన్లు చెయ్యడానికి ప్రజలకు డబ్బులు ఇచ్చారు. ఈ హన్సా గ్రూప్ ఓ మార్కెట్ రీసెర్చ్ సంస్థ. దీన్ని బార్క్ నియమించుకుంది. ఇది ఇళ్లలో టీవీ ఛానెల్స్ చూస్తున్న వారికి సెట్ చేసిన బారోమీటర్లను చెక్ చేసి... వ్యూవర్‌షిప్ డేటాను తెస్తుంది. ఐతే... వారు ఫలానా ఛానెలే చూడాలని నెలకు రూ.500 చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. ఇలా చెయ్యడం వల్ల ప్రత్యేక ఛానెల్స్ రేటింగ్ పెరగగా... మిగతా ఛానెళ్ల రేటింగ్స్ అక్రమంగా పడిపోయాయి.
  Published by:Krishna Kumar N
  First published: