Billionaire Barber: కోటీశ్వరుడిగా మారిన బార్బర్​.. అతని వద్ద 400 లగ్జరీ కార్లు.. ఇప్పటికీ కూడా..

ప్రతీకాత్మక చిత్రం((Image Credits: Shutterstock)

భారత్​లో కిందిస్థాయి నుంచి కోటీశ్వరులుగా(Billionaire)ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వివిధ రకాల బ్యాక్​గ్రౌండ్ల నుంచి.. విభిన్న రంగాల నుంచి వచ్చినవారు ఉన్నారు.

  • Share this:
భారత్​లో కిందిస్థాయి నుంచి కోటీశ్వరులుగా(Billionaire)ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వివిధ రకాల బ్యాక్​గ్రౌండ్ల నుంచి.. విభిన్న రంగాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఇందులో కొందరు కోటీశ్వురులవుతారని కనీసం ఊహించలేదు కూడా. అయినా తమ కష్టంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. అలాంటి కథే ఇది. ఓ బార్బర్ ఏకంగా బిలియనీర్​గా మారారు. అవును, మీరు చదివింది నిజమే. ఆయన పేరు రమేశ్ బాబు(Ramesh Babu). ఇండియన్ బిలియనీర్ బార్బర్​గా(Billionaire Barber) ఆయన ప్రసిద్ధి చెందారు. దేశంలోని 140 బిలియనీర్లలో ఆయన ఒకరు. రోల్స్ రాయిస్(Roll Royce)​, మెర్సెజెడ్ బెంజ్​, జాగ్వార్​, బీఎండబ్ల్యూ ఇలా మొత్తంగా రమేశ్​ వద్ద 400 లగ్జరీ కార్లు ఉన్నాయి. అసలు బార్బర్​ నుంచి ఆయన బిలినియర్​గా ఎలా మారారు.. జీవితం మలుపు తిప్పిన సంఘటన ఏంటి..? వంటి విషయాలు తెలుసుకుందాం.

రమేశ్ బెంగళూరులో( Bangalore) జన్మించారు. ఆయన తండ్రి పి.గోపాల్​.. బార్బర్​ షాప్ నడిపేవారు. రమేశ్​కు ఏడు సంవత్సరాల వయసు ఉండగానే తండ్రి గోపాల్ మృతి చెందారు. దీంతో చిన్న వయసులోనే రమేశ్ కష్టాలను ఎదుర్కొన్నారు. రమేశ్ తల్లి బాధ్యతలు చేపట్టి చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. తన భర్త నడిపిన బార్బర్ షాప్​ను రోజుకు రూ.5లకు అద్దెకు ఇచ్చే వారు.

13 ఏళ్ల వయసులో రమేశ్​.. కుటుంబానికి చేదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. పేపర్​, పాలు డెలివరీ చేస్తూ కొంత సంపాదించేవారు. పదో తరగతి వరకు చదివిన ఆయన ఆ తర్వాత పూర్తి సమయం బార్బర్​ షాప్​ను నడిపేందుకే కేటాయించారు. ఆ తర్వాత తన తండ్రి బార్బర్​ షాప్​ను(barbershop) మోడ్రన్​గా మార్చేశారు రమేశ్​. షాపు రూపురేఖలను మార్చేసి ఇన్నర్ స్పేస్(Inner Space) అని పేరు పెట్టారు.

Health Tips: ఈ 5 రకాల ఆహార పదార్థాలను రెండో సారి వేడిచేసి తింటున్నారా?.. అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్టే..!

1993లో మరింత ఎదగాలని రమేశ్ నిర్ణయించుకున్నారు. వేరే వ్యాపారంలో కూడా అడుగుపెట్టాలని భావించారు. దీంతో తాను దాచిన డబ్బుతో పాటు తన బంధువు వద్ద డబ్బు తీసుకొని ఓ మారుతీ ఓమ్నీ వ్యాన్​ను కొని దాన్ని అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. తనకు వ్యాన్ నడిపే సమయం లేకపోవడంతో రెంట్​కే ఇచ్చే వారు. ఇదే రమేశ్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ వ్యాపారం రమేశ్ టూర్స్ అండ్స్ ట్రావెల్స్​గా మారిపోయింది. 2004లో ఆయన రూ.38లక్షలు ఖర్చు చేసి మెర్సెడెజ్ ఈ క్లాస్ సెడన్ కారును కొని అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా తలరాత మారిపోయింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు లగ్జరీ కార్లు, బస్సులు మొత్తం కలిపి 400 వరకు రమేశ్​ వద్ద ఉన్నాయి. బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్​, మెర్సెడెజ్ నుంచి ఇన్నోవా కార్ల వరకు అందులో ఉన్నాయి.

Covid New Symptoms: కరోనా సరికొత్త లక్షణాలు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మాత్రమే కాదు.. ఈ కొత్త లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి..

ఇన్ని కోట్లు సంపాదించినా ఇప్పటికీ రోజూ రమేశ్​ సెలూన్​లో పని చేస్తారు. బార్బర్​ నుంచి బిలినియర్​గా ఎదగడంతో పాటు.. జీవితంలో పైకి ఎదుగుతామా లేదా అని సందేహిస్తున్న ఎంతో మందికి రమేశ్ బాబు స్ఫూర్తిగా నిలిచారు. అంకితభావంతో కష్టపడితే విజయం వరిస్తుందని చాటిచెప్పారు.
Published by:Sumanth Kanukula
First published: