International Conspiracy On PM Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై తీవ్ర దుమారం చెలరేగుతుంది. "ఇండియా: ది మోదీ క్వశ్చన్" పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ(BBC Documentary) వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల(Gujarat riots) సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించిందిఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసింది. భారత్‌లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు వ్యక్తులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ట్విటర్‌లోనూ ఈ డాక్యుమెంటరీ లింకులను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్‌లో బ్లాక్ చేయాలంటూ యూట్యూబ్, ట్విటర్‌లను ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆదేశాలు జారీ చేశారు. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని కేంద్రం దీనిపై తీవ్రంగా విమర్శించింది. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆరోపించారు.
బీబీసీ అధికారిక యూట్యూబ్ నుంచి కూడీ ఈ వీడియోను తొలగించాలని బీబీసీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సూచించింది. ఇక సోషల్ మీడియా వేదికల్లో దీనికి సంబంధించిన లింకులను బ్లాక్ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు,బ్రిటన్ లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. పాక్ సంతతికి చెందిన ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ హస్తం ఉందని ఆరోపించారు. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో సహా చాలాయంది బ్రిటన్ ఎంపీలు దీన్ని ఖండించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ..100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
Inspirational Story: ఢిల్లీ పార్లమెంట్‌కు డిగ్రీ విద్యార్దిని .. మోదీ ముందు మాట్లాడే ఛాన్స్ కొట్టేసిన శ్రీవర్షిణి
మరోవైపు, ఈ అంశంపై మాజీ న్యాయమూర్తులు,బ్యూరోక్రాట్లు ప్రధాని మోదీకి మద్దతుగా లేఖను రిలీజ్ చేశారు. "ఇది భారత్‌లో హిందూ-ముస్లిం మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య. విభజించు-పాలించు అనేది బ్రిటిష్ నైజం అయితే అందరినీ కలుపుకొనిపోవడం భారత్ నీతి. బీబీసీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి" అని లేఖలో వారు వ్యాఖ్యానించారు. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీలో అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని,దీనిపై విచారణ జరపాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ లేఖ రాసింది. దీనిని ప్రతికూల మీడియా రిపోర్ట్ గా చూడకూడదని,ఊహాజనిత సాక్ష్యాలతో కొన్ని అదృశ్య శక్తులు ప్రధానిని అపఖ్యాతి చేయాలని చూస్తున్నాయని,మోదీ స్థాయిని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందని లేఖలో బార్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఆదిష్ సి అగర్వాలా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi