Coronavirus: అలర్ట్.. ఇకపై బ్యాంకులకు మూడు గంటలే పనిదినాలు..

కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాంకులు ఇక నుంచి మూడు గంటల పాటే పని చేయనున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బ్యాంకులకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే మొబైల్ బ్యాంకులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

news18-telugu
Updated: March 26, 2020, 5:24 PM IST
Coronavirus: అలర్ట్.. ఇకపై బ్యాంకులకు మూడు గంటలే పనిదినాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇక నుంచి బ్యాంకులు మూడు గంటల పాటు మాత్రమే పనిచేయనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు 8 గంటల పాటు పనిచేయడమనేది కష్టంగా మారుతోంది. అదే తరుణంలో బ్యాంకులను పూర్తిగా మూసేద్దామన్న కుదిరేట్టు లేదు. అత్యవసర పనుల్లో డబ్బు అవసరం పడుతున్న నేపథ్యంలో బ్యాంకు సేవలందించడం తప్పనిసరిగా మారింది. దీంతో బ్యాంకులను రోజులో మూడు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే పనిచేయనున్నాయి.

ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. కాగా బ్యాంకులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, ఉదయం 8 నుంచి 11, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల్లో ఏదైనా మూడు గంటల పాటు పనిచేయనున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. ప్రజల కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు