హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi-Shiek Hasina : భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఓ రోల్ మోడల్..త్వరలోనే ఆ ఒప్పందం ఉంటుందన్న మోదీ

Modi-Shiek Hasina : భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు ఓ రోల్ మోడల్..త్వరలోనే ఆ ఒప్పందం ఉంటుందన్న మోదీ

మోదీ-షేక్ హసీనా

మోదీ-షేక్ హసీనా

Shiek Hasina Meets PM Modi :  నాలుగు రోజుల భారత పర్యటన కోసం సోమవారం ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా(Bangladesh PM Shiek Hasina) ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ(PM Modi) స్వాగతం పలికారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Shiek Hasina Meets PM Modi :  నాలుగు రోజుల భారత పర్యటన కోసం సోమవారం ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా(Bangladesh PM Shiek Hasina) ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మంగళవారం రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న షేక్‌ హసీనాకు ప్రధాని మోదీ(PM Modi) స్వాగతం పలికారు. భారత ప్రధానితో చర్చల నిమిత్తం దేశ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకి సగౌరవంగా త్రివిధ దళాల సైనిక వందనంతో ఆహ్వానం పలికారు. అంతకుముందు మహాత్మా గాంధీ స్మారక స్థూపం రాజ్‌ఘాట్ వద్ద ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. రాష్ట్రపతి భవన్ దగ్గర మీడియాతో మాట్లాడిన షేక్ హసీనా.. భారత పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని తెలిపారు. భారత ప్రధాని మోదీపై షేక్ హసీనా పొగడ్తల వర్షం కురిపించారు. కరోనా సమయంలోనూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్‌ అందించిన సాయం గొప్పదని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు దేశాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షతో సమైక్యంగా ముందుకు సాగుతామని షేక్‌ హసీనా అన్నారు. స్నేహంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ ప్రధాన కర్తవ్యమని హసీనా తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై భారత్, బంగ్లాదేశ్ దేశాలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. భారతదేశం బంగ్లాదేశ్‌ సత్సంబంధాలతో దక్షిణ ఆసియా అంతటా ప్రజలకు మెరుగైన జీవనం లభిస్తుందని,ఇదే తమ కర్తవ్యమని బంగ్లాదేశ్ ప్రధాని తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందంనం స్వీకరణ తర్వాత ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీతో సమావైశన షేక్ హసీనా పలు విషయాలనై ఆయనతో చర్చించారు. నీరు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలకు సంబంధించిన ద్వైపాక్షిక ఇష్యూలపై ఇరు ప్రధానులు చర్చించారు. భారతదేశం,బంగ్లాదేశ్‌లు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , షేక్ హసీనా సమక్షంలో ఏడు అవగాహన ఒప్పందాలు (MOUలు) పై సంతకాలు చేశాయి. అనంతరం భారత్-బంగ్లాదేశ్ ప్రధానులు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..." భారతదేశం, బంగ్లాదేశ్ ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాయి. బంగ్లాదేశ్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. ఆసియా వ్యాప్తంగా బంగ్లాదేశ్ నుండి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఈ పురోగతిని మరింత వేగవంతం చేయడానికి త్వరలో ద్వైపాక్షిక ఆర్థిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభిస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా భారత్-బంగ్లాదేశ్ మధ్య పరస్పర సహకారం పెరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా , నేను వివిధ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించాము. కోవిడ్ మహమ్మారి ఇటీవలి ప్రపంచ సంఘటనల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వరదల నివారణపై మేము మా సహకారాన్ని అందించాము. మేము బంగ్లాదేశ్‌తో వరదలకు సంబంధించిన రియల్ టైమ్ డేటాను పంచుకుంటున్నాము. ఉగ్రవాదంపై కూడా చర్చించాము. మనకు వ్యతిరేకమైన శక్తులను మనం కలిసి ఎదుర్కోవడం అత్యవసరం. 54 నదులు భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా ప్రవహిస్తాయి, రెండు దేశాల ప్రజల జీవనోపాధికి అనుసంధానించబడి ఉన్నాయి. ఈరోజు మేము కుషియారా నది నీటి భాగస్వామ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాం"అని మోదీ తెలిపారు.

Techies Tractor Ride Video : ట్రాక్టర్లలో ఆఫీసులకి టెక్కీలు,ఒక్కొక్కరికీ రూ.50 ఛార్జీ

సంయుక్త మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ మీడియా ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.." భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరుపుకునే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు భారత ప్రభుత్వానికి, నా భారతీయ స్నేహితులకు నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే 25 సంవత్సరాలకు అమృత్ కాలపు కొత్త ఉషస్సు సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ కోసం చేసిన తీర్మానాలను సాధించడానికి భారతదేశం ముందుకు సాగుతున్నందున నేను మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రధాని మోదీ , నేను మరో రౌండ్ ఫలవంతమైన చర్చను ముగించాము. దాని ఫలితం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనాలను తెస్తుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు జోడింపును అందించడం కొనసాగించే మోదీజీ దార్శనిక నాయకత్వాన్ని అభినందిస్తున్నాము. బంగ్లాదేశ్‌కు భారతదేశం అత్యంత ముఖ్యమైన, సన్నిహిత పొరుగు దేశం. భారతదేశం-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు పొరుగు దౌత్యానికి రోల్ మోడల్‌గా ప్రసిద్ధి చెందాయి. తీస్తా నీటి-భాగస్వామ్య ఒప్పందంతో సహా మన రెండు దేశాలు చాలా అసాధారణమైన సమస్యలను పరిష్కరించాయి. అన్ని సమస్యలను త్వరగా ముగించాలని మేము ఆశిస్తున్నాము"అని తెలిపారు.

కాగా,రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 2021లో 50వ సంవత్సరానికి చేరుకున్న తర్వాత షేక్ హసీనా భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా చివరిసారిగా 2019లో భారత్‌ను సందర్శించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bangladesh, India, Pm modi

ఉత్తమ కథలు