బంగ్లాదేశ్(Bangladesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్రిపూర్ (Qutubpur) లోని కుతుబ్‌పూర్(Madripur)ప్రాంతంలో సుమారు 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు (Bus accident)అదుపుతప్పి కాలువలో పడింది. ఈదుర్ఘటనలో స్పాట్‌లో 17మంది ( 17 Passengers Died )చనిపోయారు. మరో పాతిక మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన వాళ్లంతా వలసవాదులుగా తెలుస్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ స్పాట్‌కు చేరుకొని సహాయకచర్యలు చేపట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్పాట్‌లో 17మంది మృతి..
బంగ్లాదేశ్‌లో ఊహించని రోడ్డు ప్రమాదం జరిగింది. సోనాదంగా నుంచి ఢాకు వెళ్తున్న బస్సు మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే పై అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 7-8గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో 17మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3మందికి తీవ్రగాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ వే నుంచి కాలువలోకి దూసుకెళ్లిన బస్సు ముందు భాగం గోడను ఢీకొట్టడంతో నుజ్జు నుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా గట్టిగా అరుపులు, కేకలు వేశారు.
నుజ్జు నుజ్జైన బస్సు ...
ప్రమాదం జరిగిన సమయంలో శిబ్‌చార్ హైవే పోలీస్ స్టేషన్‌కు చెందిన అబూ నయీమ్ మహ్మద్ మోఫ్జిల్ హక్ రెస్క్యూ ఆపరేషన్ టీమ్‌తో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వాళ్లంతా స్పాట్‌కు చేరుకున్నారు. నుజ్జునుజ్జైన బస్సులో మరణించిన వారి మృతదేహాలను స్థానికుల సహాయంతో వెలికి తీశారు. గాయపడిన 30మంది ప్రయాణికుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కూడా కొందరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్..
డ్రైవర్ బస్సును వేగంగా నడపటం వల్లే ఎక్స్‌ప్రెస్ వేపై టైర్ పగిలింది. దీంతో స్పీడ్ కంట్రోల్ కాలేదని..ఆక్రమంలోనే కాలువలోకి దూసుకెళ్లి గోడను ఢీకొట్టిందని ప్రయాణికులతో పాటు స్థానికులు చెబుతున్నారు. దీనంతటికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా చెబుతున్నారు. మరణించిన వారితో పాటు తీవ్రంగా గాయపడిన ప్రయాణికుల వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, National News, Road accident