ముఖ్యమంత్రి కారుకు జరిమానా.. ఆన్‌లైన్‌లో ట్రాఫిక్ పోలీసుల చలాన్

కుమారస్వామి (ఫైల్ ఫోటో)

అదేంటి.. సీఎం కారు వస్తుంటే ట్రాఫిక్ పోలీసులే అన్నివైపులా ట్రాఫిక్‌ను నిలిపేస్తారు కదా? మరి ముఖ్యమంత్రి కారుకు జరిమానా విధించడమేంటీ అనుకుంటున్నారా? అయితే, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి చెందిన కారు కాదది.. సీఎం ప్రైవేటు వాహనం. ట్రాఫిక్ ఉల్లంఘంచిన కారణంగా ఆ కారుకు జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

 • Share this:
  అదేంటి.. సీఎం కారు వస్తుంటే ట్రాఫిక్ పోలీసులే అన్నివైపులా ట్రాఫిక్‌ను నిలిపేస్తారు కదా? మరి ముఖ్యమంత్రి కారుకు జరిమానా విధించడమేంటీ అనుకుంటున్నారా? అయితే, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి చెందిన కారు కాదది.. సీఎం ప్రైవేటు వాహనం. ట్రాఫిక్ ఉల్లంఘంచిన కారణంగా ఆ కారుకు జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఆ కారు ఎవరిదో కాదు.. కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిది. అయితే, రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా సీఎం పేరుతో ఉన్న కారైతే ఏంటి? తప్పు తప్పే అని ప్రొసీడ్ అయిపోయారు ట్రాఫిక్ పోలీసులు. కుమార స్వామి ఎస్‌యూవీ కారుకు.. పోయిన నెలలో రెండు సార్లు జరిమానా విధించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 10న ఆ వాహనంలోని వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న కారణంగా చలాన్ నమోదైంది. మరో ఏరియా బసవేశ్వర సర్కిల్‌లో అదేనెల 22న మితిమీరిన వేగంతో దూసుకువెళ్లిన కారణంగా.. ఆన్‌లైన్‌లో చలాన్ నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇందులో ఒక చలాన్ రూ. 100 కాగా, మరొకటి రూ. 300 గా ఉంది. అయితే, చలాన్ నమోదైన ఈ రెండు సందర్భాల్లో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. బెంగళూరులోనే ఉన్నారు.

  Kumaraswamy, Kumaraswamy on Pulwama, Karnataka CM, Befitting reply, won't bring back lost lives, పుల్వామా ఉగ్రదాడి, పుల్వామా ఎటాక్, దెబ్బకు దెబ్బ, పాకిస్థాన్, జైషే మొహ్మద్,
  కర్ణాటక ముఖ్యమంత్రి కుామరస్వామి ( ఫైల్ ఫోటో)


  అయితే, ఆటోమేటెడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమేరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనల దృశ్యాలు నమోదయ్యాయని, అందులో భాగంగానే.. నోటీసులు జారీ అయ్యాయని పోలీసులు చెప్పారు. అయితే, ఆ వాహనం కస్తూరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రిజిస్టరై ఉన్నట్టు తెలుస్తోంది. చలాన్లు కూడా అదే పేరుతో నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
  First published: