హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ట్రాఫిక్ కష్టాలకు చెక్..బెంగుళూరులో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం!

ట్రాఫిక్ కష్టాలకు చెక్..బెంగుళూరులో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం!

Helicopter Services: రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

Helicopter Services: రండి బాబూ రండి.. బెంగళూరులో హెలికాప్టర్ బుకింగ్ సేవలు.. టికెట్ కాస్ట్ ఎంతంటే..

భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా చాలామంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడం ఆలస్యమవుతుండటం బెంగళూరులో ,చాలా సర్వసాధారంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Helicopter Ride Service in Bengaluru : సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగుళూరు(Benguluru)లో ట్రాఫిక్ జామ్ భారీగానే ఉంటుంది. దేశ,విదేశాల నుంచి నిత్యం బెంగళూరుకి వేలాదిమంది వస్తుంటారు,అలాగే సిటీలో నివసించేవారి సంఖ్య కూడా కోటి పైనే ఉంటుంది. అయితే భారీ ట్రాఫిక్ జామ్(Traffic Jam) కారణంగా చాలామంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడం ఆలస్యమవుతుండటం బెంగళూరులో చాలా సర్వసాధారంగా మారింది. బస్సు ఎక్కినా,క్యాబ్ ఎక్కినా,బైక్ మీద ఆఫీసులకు వెళ్లాలనుకున్నా కొన్నిసార్లు గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయి రోడ్డుపైనే మన సమయం అంతా వృద్ధాగా పోతుంటది. బెంగళూరు సిటీలో మెట్రో ఉంది కదా మరి ఇంత ఇబ్బంది ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. బెంగుళూరులో మెట్రో సేవలు ఉన్నప్పటికీ నగరంలోని అన్ని ప్రాంతాలకి ఆ సౌకర్యం లేదు. కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే నగరంలో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ కారణంగా చాలామంది తమ తమ ఆఫీసులకు లేటుగా వెళ్లి బాస్ చేత తిట్టు కూడా తింటుంటారు. అయితే ఇక నుంచి ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఆఫీసులకు,సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ కి నిమిషాల్లో చేరుకోవచ్చు. బెంగుళూరులో వచ్చే నెల 10వ తేదీ నుంచి హైలికాఫ్టర్ రైడ్ సేవలు(Helicopter Ride Service In Bengaluru) ప్రారంభం కానున్నాయి.

అర్బన్ ఎయిర్ మొబిలిటీ సంస్థ BLADE India బెంగళూరు ప్రజలకు ట్రాఫిక్‌ను ఎదుర్కోవటానికి గొప్ప ఆఫర్ ఇచ్చింది. బెంగళూరు సిటీ- కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణం కోసం ఛాపర్ సేవలను ప్రారంభించనున్నట్లు బ్లేడ్ ఇండియా(Blade India)ప్రకటించింది. అక్టోబర్ 10 నుండి హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభమవుతాయి. వారానికి ఐదు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ ఎయిర్‌పోర్ట్( HAL)నుండి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 హెలికాప్టర్లను నడపనున్నట్లు బ్లేడ్ ఇండియా ప్రకటించింది. H125 DVG ఎయిర్‌బస్ హెలికాప్టర్.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం- బెంగళూరు విమానాశ్రయం మధ్య ఒకేసారి ఐదు నుండి ఆరుగురు ప్రయాణికులతో ప్రయాణించగలదు. దీంతో ఇప్పుడు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుండి సిటీలోకి చేరుకోవడానికి ప్రయాణ సమయం ప్రస్తుత 120 నిమిషాల నుండి కేవలం 15 నిమిషాలకు తగ్గుతుందని కంపెనీ తన అధికారిక వెబ్ సైట్ లో తెలిపింది. ఇక,ఈ హెలికాఫ్టర్ లో ఒక్కో సీటు ధర రూ. 3,250 (పన్నులు మినహాయించి)గా ఫిక్స్ చేశారు. ప్రారంభంలో రోజుకు రెండు హెలికాఫ్టర్ సర్వీసులు ఉంటాయి. బెంగళూరు నుండి హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి రైడ్ ఉదయం 9 గంటలకు షెడ్యూల్ చేయబడింది. తిరిగి వచ్చే ఛాపర్ సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరుతుంది. అయితే ప్రస్తుతానికి ఎయిర్ పోర్ట్-'సిటీ మధ్య నడిచే ఈ సర్వీసులని త్వరలో ఐటీ కంపెనీలు అధికంగా ఉండే వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.

జాక్ పాట్ కొట్టడమంటే ఇదే : అనుకోకుండా ఒకే లాటరీకి మూడు టిక్కెట్లను కొన్నాడు..మూడింటిలో గెలిచి కోటీశ్వరుడయ్యాడు

బ్లేడ్ ఇండియా... న్యూయార్క్‌ కి చెందిన BLADE అర్బన్ ఎయిర్ మొబిలిటీ ఇంక్ - న్యూ ఢిల్లీకి చెందిన హంచ్ వెంచర్స్ మధ్య జాయింట్ వెంచర్. భారతదేశంలో తన స్వల్ప-దూర మొబిలిటీ సేవను పెంచడానికి విమానాల విస్తరణ కోసం కంపెనీ ఎయిర్‌బస్ మరియు ఈవ్ ఎయిర్ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వెబ్‌సైట్ ప్రకారం, గోవా విమానాశ్రయంలో ఇదే విధమైన సేవలు ఉన్నాయి. బ్లేడ్ ఇండియా.. మహారాష్ట్రలో ముంబై, పూణే మరియు షిర్డీ మధ్య తన హెలికాఫ్టర్ రైడ్ సేవలను ప్రారంభించింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bengaluru, Helicopter

ఉత్తమ కథలు