యువతి పొట్టి దుస్తులు వేసుకుందని.. బైక్ ఆపి ఆమెపై..

ఓ యువతి పొట్టి దుస్తులు వేసుకుందని ఓ వ్యక్తి ఆమెపై దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? అంటూ యువతిని దూషించాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 9, 2019, 2:54 PM IST
యువతి పొట్టి దుస్తులు వేసుకుందని.. బైక్ ఆపి ఆమెపై..
రోడ్డు మీద వెళ్లే యువతికి సలహాలు ఇచ్చిన యువకుడు
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 9, 2019, 2:54 PM IST
ఓ యువతి పొట్టి దుస్తులు వేసుకుందని ఓ వ్యక్తి ఆమెపై దారుణంగా ప్రవర్తించాడు. సరైన దుస్తులు వేసుకోలేవా? ఇలాంటి డ్రెస్ వేసుకొని రోడ్లపై ఎలా తిరుగుతున్నావ్? అంటూ యువతిని దూషించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన 28 ఏళ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. అక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై షాపింగ్‌కి వెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి బైక్ ఆపి, నీకు ఇంటి వద్ద దుస్తులు లేవా? ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావ్? అంటూ ఆమెపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇంతలో ఆమె బాయ్‌ఫ్రెండ్ అతడ్ని అడ్డుకొని, ఎదురుతిరిగాడు. ఏం మాట్లాడుతున్నావ్? అంటూ వీడియో తీయడం ప్రారంభించడంతో సదరు వ్యక్తి తగ్గాడు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించేలా, ఇక్కడి నిబంధనలు పాటించేలా డ్రెస్ వేసుకోవాలంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

ఇంతలో ఆ యువతి కలగజేసుకొని ‘నా ఇష్టం ఉన్న డ్రెస్‌లు వేసుకుంటా. అడగడానికి నీవెవరు?’ అని ప్రశ్నించింది. భారతీయ మహిళలు ఇలాంటి దుస్తులు ధరించరు.. అని అతడు అనగా.. ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...