హోమ్ /వార్తలు /జాతీయం /

బ్యాండ్, బాజా, బరాత్.. అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం

బ్యాండ్, బాజా, బరాత్.. అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెళ్లివేడుక పరిసరాలు.. బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడాయి. వీఐపీలు, వీవీఐపీల కేటగిరీలో అతిరథులు ఆకాశ్, శ్లోకాల వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇంకా చదవండి ...

  రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెళ్లివేడుక పరిసరాలు.. బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడాయి. ఇక, వీఐపీలు, వీవీఐపీల కేటగిరీలో అతిరథులు ఆకాశ్, శ్లోకాల వివాహ వేడుకకు హాజరయ్యారు. దేశ విదేశాలకు చెందిన వ్యాపారులు, సినీ, రాజకీయ వర్గాలకు చెందిన అతిరథ మహారథులు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకకు తరలివచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. భార్య అమృతతో కలిసి ఆకాశ్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, మాజీ మంత్రి అనంద్ శర్మ తదితరులు పెళ్లివేడుకకు హాజరయ్యారు.


  ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం సందర్భంగా వధూవరులకు దిష్టితీస్తున్న నీతా అంబానీ


  ముంబైలో జరిగిన ఆకాశ్, శ్లోకాల వివాహ మహోత్సవానికి... అంబానీ కూతురు ఈశా తన భర్త ఆనంద్‌తో కలిసి విచ్చేశారు. వీరితో పాటు పిరమాల్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అజయ్ పిరమాల్ ఆయన భార్య స్వాతి కూడా హాజరయ్యారు.


  ముఖేష్ అంబానీ దంపతులతో టోనీబ్లేయర్ దంపతులు
  ముఖేష్ అంబానీ దంపతులతో టోనీబ్లేయర్ దంపతులు


  ఈ వివాహ వేడుకలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అతిథులు సైతం తరలివచ్చారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్.. భార్య చెర్రీ బ్లేయర్‌తో కలిసి ఈ పెళ్లికి హాజరయ్యారు. అంబానీ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, భార్య అంజలీ పిచాయ్‌తో కలిసి హాజరయ్యారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దంపతులు కూడా ఈ విశిష్ట అతిథుల లిస్టులో ఉన్నారు.


  తాత ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ పూజలు
  తాత ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి ఆకాశ్ పూజలు


  ప్రిన్సెస్ దియాకుమారి,  క్రికెటర్లు హార్థిక ప్యాండా, మాజీ క్రికెటర్ రాబిన్‌సింగ్, శ్రీలంక మాజీ క్రికెటర్ జయవర్దనే, బాలీవుడ్ సెలబ్రిటీలు జూహి చావ్లా, రణ్‌భీర్ కపూర్, కరణ్ జోహర్... ఎన్సీపీ నేత ప్రఫూల్ పటేల్ తదితరులు పెళ్లి మండపంలో సందడి చేశారు.


  ఆకాశ్ పెళ్లిలో అనిల్ అంబానీ ఫ్యామిలీ


  గెస్ట్ లిస్టులో మరికొందరు కార్పొరేట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.


  ఆకాశ్ అంబానీ పెళ్లిలో అతిథుల సందడి


  శ్యాంసంగ్ వైఎస్ ప్రెసిడెంట్ జే వాయిలీ, అంతర్జాతీయ ఒలింపిక్ సమితి సభ్యుడు క్రిస్టోఫ్ డీ కేపర్, సౌదీ ప్రభుత్వ మంత్రి ఖలిద్ ఫలీహ్, బెల్జియం రాజనీతిజ్ఞులు, యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు వెరోనిక్ డీ పెపర్ తదితరులు హాజరయ్యారు.


  ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా పెళ్లి వేడుకలో ఇషా అంబానీ


  ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్ అంబానీ శ్లోకాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.


  ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకలో రతన్ టాటా


  బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్‌ఖాన్ సతీసమేతంగా  పెళ్లి వేడుకలో పాల్గొని ఆకాశ్ అంబానీ, శ్లోకాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.


  ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకలో అమీర్ ఖాన్ దంపతులు


  పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన బరాత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబసభ్యులతో పాటు, ఆత్మీయ అతిథులందరూ పాల్గొన్నారు. డ్యాన్సులతో అదరగొట్టారు.


  బరాత్‌లో నీతా అంబానీ నృత్యం


  అంబానీ దంపతుల నృత్యం


  బరాత్‌లో అంబానీ కుటుంబసభ్యుల నృత్యం


  ముంబైలోని జియో టవర్స్‌లో జరిగిన ఆకాశ్ అంబానీ, శ్లోకా పెళ్లి వేడుకలో బరాత్ అదిరిపోయింది. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో షారూఖ్‌ ఖాన్ డ్యాన్సులతో అదరగొట్టేశాడు.


  బరాత్‌లో షారుక్ ఖాన్ స్టెప్పులు


  కుమారుడి పెళ్లి సంబరాల్లో నీతా అంబానీ


  అంబానీ కుటుంబసభ్యులు సైతం బాలీవుడ్ స్టార్స్‌తో కలిసి స్టెప్పులేశారు. బరాత్‌లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ రణ్‌భీర్‌కపూర్, షారూక్‌ఖాన్, అమిర్‌ఖాన్, ప్రియాకం చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ పాల్గొని స్టెప్పులతో అదరగొట్టేశారు.


  ఆకాశ్ అంబానీ పెళ్లి బరాత్‌లో ఇషా అంబానీ


  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హార్థి పాండ్యా, క్రునాల్ పాండ్యా, తలైవా రజనీకాంత్ తదితరులు ఈ పెళ్లి సంబరాల్లో పాల్గొన్నారు.


  ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకలో రజనీకాంత్


  ఆకాశ్ అంబానీ పెళ్లిలో బాలీవుడ్ అందాల భామలు.. కరీనాకపూర్, కరిష్మాకపూర్ సందడి చేశారు. న్యూ కపుల్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.


  ఆకాశ్ అంబానీ పెళ్లిలో కరీనాకపూర్, కరిష్మా కపూర్


   

  ఇవి కూడా చూడండి :


  photos: ఆకాశ్ అంబానీ- శ్లోకా పెళ్లివేడుక.. తరలివచ్చిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు

  First published:

  Tags: Akash Ambani, Mukesh Ambani, Mumbai

  ఉత్తమ కథలు