రెడ్ డ్రెస్ బ్యాన్ చేయాలా?.. ఇదేం పిటిషన్

దేశంలో ఎర్ర డ్రెస్సులు బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది.

news18-telugu
Updated: February 5, 2019, 9:07 PM IST
రెడ్ డ్రెస్ బ్యాన్ చేయాలా?.. ఇదేం పిటిషన్
రెడ్ డ్రెస్సులు
  • Share this:
దేశంలోని పలు కోర్టుల్లో చాలారకాలైన పిటిషన్లు వేస్తుంటారు. కొందరు మౌలిక వసతుల సదుపాయాల గురించి, మరికొందరు అవినీతి కేసుల గురించి, ఇంకొందరు పథకాలు, ప్రభుత్వ నియామకాల గురించి ప్రజాప్రయోజనవ్యాజ్యాలు దాఖలు చేస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన పిటిషన్లు కూడా వేస్తుంటారు. అలాంటి పిల్ ఒకటి సుప్రీంకోర్టులో వేశారు. దేశంలో ఎర్ర డ్రెస్సులు బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. సదరు పిటిషన్ హాస్యాస్పదంగా ఉందంటూ డిస్మిస్ చేసింది.

రెడ్ డ్రెస్సులు
రెడ్ డ్రెస్సులు


దేశంలో ఎన్నో సమస్యలకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వస్తున్నాయి. వాటిని పరిష్కరించడానికే న్యాయమూర్తులకు సమయం సరిపోవడం లేదు. మధ్యలో ఇలాంటి ‘హాస్యాస్పదంగా’ ఉండే పిటిషన్లు వేయడం ఏంటని న్యాయస్థానం నిలదీసింది.

రెడ్ డ్రెస్సులు
రెడ్ డ్రెస్సులు


ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసే వ్యక్తి లేదా సంస్థ, దాని ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయాలి. దానికి సంబంధించిన డేటాను కూడా పొందుపరచాలి. అయితే, రెడ్ డ్రెస్సులు బ్యాన్ ఎందుకు చేయాలనే ప్రాధమిక ప్రశ్నకు కూడా సమాధానం లేదు.

3.4 crore pending cases in indian courts says kanchan gupta
సుప్రీం కోర్టు(File)


గతంలో కూడా ఇలాంటి కొన్ని వింత పిటిషన్లు దాఖలయ్యాయి. దసరా రోజు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. సిగరెట్ ప్యాకెట్ల మీద ముద్రించినట్టే మద్యం బాటిళ్ల మీద కూడా పుర్రెబొమ్మలను ప్రింట్ చేయాలంటూ పిల్ దాఖలైంది. అలాగే, ఎమ్మెల్యేలు, ఎంపీలు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయకూడదంటూ గత ఏడాది పిటిషన్ దాఖలైంది.
First published: February 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading