Home /News /national /

BAN ON POLITICAL ROAD SHOWS RALLIES EXTENDED TILL FEBRUARY 11 EC NEW GUIDELINES FOR ASSEMBLY ELECTIONS 2022 MKS

Assembly Polls: పెరిగిన Covid మరణాలు.. సభలు, రోడ్‌షోలపై నిషేధం పొడిగింపు -EC నూతన మార్గదర్శకాలివే..

ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్

ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్

కరోనా విలయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. బహిరంగ సభలు, రోడ్ షోలపై నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది.

దేశంలో కరోనా విలయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం నాటి లెక్కల్లో, కరోనా కొత్త కేసులు తగ్గినా, మరణాలు వెయ్యికి చేరువ కావడం, మరికొంత కాలం అప్రమత్తత అవసరమన్న హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సరళిపై ఈసీ తాజా ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన నిషేధాన్ని ఈసీ మరోసారి పొడిగించింది.

ఫిబ్రవరి11వ తేదీ వరకూ ఎన్నికల సభలు, రోడ్ షోలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ సోమవారం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఫిజికల్ ర్యాలీలపై నిషేధం పొడిగించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కోవిడ్ పరిస్థితిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే సమగ్ర సమీక్ష జరిపారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు.

UP Polls: ఘర్షణలు ఎగదోసేవారికి టికెట్లా? అది నకిలీ సమాజ్‌వాద్: తొలి సభలోనే PM Modi ఫైర్


ఫిజికల్ పబ్లిక్ మీటింగులు, ఇండోర్ మీటింగులు, ఇంటింటి ప్రచారాలకు సంబంధించిన కొన్ని సడలింపులను ఈసీ ప్రకటించింది. ఫిజికల్ ర్యాలీల్లో గరిష్టంగా 1,000 మంది వరకూ అనుమతిస్తారు. ఇండోర్ మీటింగ్‌లకు 500 మందిని, డోర్-టు-టోర్ ప్రచారానికి 20 మందిని అనుమతిస్తారు. రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Budget Session: మోదీ సర్కార్ భేష్.. మరో 25ఏళ్లకూ పునాదులు పటిష్టం: రాష్ట్రపతి ప్రసంగం హైలైట్స్


ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుండగా, మణిపూర్ లో రెండు, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లో ఒకే విడతలో( ఫిబ్రవరి 14న) ఎన్నికలు పూర్తవుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Covid, Election Commission of India

తదుపరి వార్తలు