హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రోడ్డుపై పడిపోయిన డబ్బులు తీసుకుంటే నేరమా? కోర్టు ఏం చెప్పిందంటే..

రోడ్డుపై పడిపోయిన డబ్బులు తీసుకుంటే నేరమా? కోర్టు ఏం చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోడ్డుపై డబ్బులు దొరికితే.. వాటిని తీసుకోవడం నేరమా? అది దొంగతనం కిందకు వస్తుందా? ఓ కేసుకు సంబంధించి ఇటీవల ఛత్తీస్‌గఢ్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  వంద మంది దోషులు తప్పించుకున్నా పరవా లేదు గానీ.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది భారతీయ న్యాయ సూత్రం. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బాలోద్ జిల్లా సెషన్స్ కోర్టు ఈ సూత్రాన్ని పక్కాగా ఫాలో అయింది. ఓ జంటపై పోలీసులు దొంగతనం కేసుపెట్టగా.. అలా పెట్టడానికి వీల్లేదని.. కేసును మార్చేసింది. బలోద్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి రోడ్డు డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బులు ఓ జంటకు దొరికాయి. ఐతే ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనం (Robbery) కేసులో అరెస్ట్ చేశారు. ఈ చర్యపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసులో నిందితులపై చోరీకి సంబంధించిన కేసు సెక్షన్ 379కి బదులు సెక్షన్ 403 (నిజాయితీ లేని ఉద్దేశంతో చరాస్తులను అపహరించడం) కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అసలేం జరిగిందంటే..?

  బలోద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఓ కిరాణా వ్యాపారి బ్యాంకు నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి ఇంటికి వెళ్తుండగా ఆ బ్యాగ్ రోడ్డుపై పడిపోయింది. పాత బస్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వ్యాపారి ఇంటికి వెళ్లి చూసే సరికి డబ్బులు లేవు. వెంటనే పరుగు పరుగున బ్యాంకుకు వెళ్లాడు. కానీ దొరక లేదు. తాను వెళ్లిన రూట్ మొత్తం వెతికాడు. కానీ ఎక్కడా దాని జాడ కనిపించలేదు. ఐతే ఆ లోపే.. బైక్‌పై వెళ్తున్న ఓ జంటకు బ్యాగ్ దొరికింది. అందులో డబ్బులు ఉడండం చూసి షాక్ తిన్నారు. అది ఎవరివి? అనే తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా.. ఇంటికి పట్టుకెళ్లారు. డబ్బులు పోయాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత.. ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీ చెక్ చేస్తే.. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ జంట.. డబ్బులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా వారిని పట్టుకొని అరెస్ట్ చేశారు.

  Shocking:కొద్ది రోజుల్లో పెళ్లి..వెడ్డింగ్ కార్డులు పంచడానికి వెళ్లిన యువతికి ఊహించని షాక్

  విచారణలో నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారని, బాలోద్ ఏఎస్పీ ప్రజ్ఞా మెష్రామ్ పేర్కొన్నారు. బ్యాగ్ తామే తీసుకెళ్లామని చెప్పారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి.. బాలోద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారి నుంచి డబ్బు బ్యాగ్‌ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో రూ.25 లక్షలు ఉన్నట్లు వ్యాపారి చెప్పాడు. బ్యాగ్‌లో ఉన్న డబ్బును లెక్కించి చూడగా.. అతడు చెప్పినట్లుగానే రూ.25 లక్షలు ఉన్నాయి. డబ్బులు ఆ వ్యాపారికి అప్పజెప్పిన తర్వాత.. నిందితులపై సెక్షన్ 379 కింద దొంగతనం కేసులు పెట్టారు.

  Shocking : భర్త ఇంట్లో టాయిలెట్ లేదని..ఆత్మహత్య చేసుకున్న భార్య!

  ఐతే వారిపై దొంగతనం కేసుపెట్టడంపై బలోద్ కోర్టు జిల్లా ప్రాసిక్యూషన్ అధికారి రాజేశ్వర్ కుజుర్ ప్రశ్నలు లేవనెత్తారు. సెక్షన్ 379కి బదులుగా సెక్షన్ 403 ప్రకారం (నిజాయితీ లేని ఉద్దేశంతో చరాస్తులను అపహరించడం) కేసుపెట్టాలని చెప్పారు. కోర్టు జోక్యంతో బలోద్ పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అందుకే రోడ్డుపై డబ్బులు దొరికితే.. సంబరపడిపోయి ఇంటికి తీసుకెళ్లకూడదు. వందో రెండు వందలో దొరికితే పర్లేదు. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు దొరికితే మాత్రం సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chhattisgarh, Crime news, Robbery

  ఉత్తమ కథలు