బాలకోట్‌ ఉగ్రవాద స్థావరాల్లో మళ్లీ కదలికలు: ఆర్మీ చీఫ్ రావత్

దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్ బాలకోట్‌లోని టెర్రర్ క్యాంప్‌లు మళ్లీ చురుకుగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు.

news18-telugu
Updated: September 23, 2019, 1:08 PM IST
బాలకోట్‌ ఉగ్రవాద స్థావరాల్లో మళ్లీ కదలికలు: ఆర్మీ చీఫ్ రావత్
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
  • Share this:
పాకిస్తాన్‌లో భారత్ జరిపిన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఉగ్రవాదులు తిరిగి పుంజుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జైష్-ఎ-మొహమ్మద్ నడుపుతున్న ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం ధ్వంసంచేసిందన్నారు. ఈ దాడులు జరిగిన దాదాపు ఏడు నెలల తర్వాత పాకిస్తాన్ బాలకోట్‌లోని టెర్రర్ క్యాంప్‌లు మళ్లీ చురుకుగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోమవారం తెలిపారు. ఇటీవల బాలకోట్‌ రీ యాక్టివ్ అయ్యిందన్నారు.
భద్రతా బలగాల కళ్లు కప్పి తప్పించుకోవడానికి టెర్రరిస్టులు కొత్త పేరుతో తిరిగి చర్యలు ప్రారంభింస్తున్నారని రావత్ పేర్కొన్నారు.

ఈ యేడాది ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడిలో అసువులు బాసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూసారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న బాలాకోట్ దగ్గర ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు