Vehicle RC Renewal: వాహనదారులకు బ్యాడ్​న్యూస్.. ఇకపై రిజిస్ట్రేషన్ ఫీజు 8రెట్లు, ఫిట్​నెస్ ఛార్జీలపై ఏకంగా 21 రెట్లు పెంపు..!

ప్రతీకాత్మక చిత్రం

వాహనదారులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఇకపై వాహనాల ఆర్సీ రెన్యూవల్, ఫిటెనెస్ సర్టిఫికెట్ ను తీసుకోవాలంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నుంచి..

  • Share this:
మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన పాత వాహనం ఉందా?.. అయితే, మీకో బ్యాడ్​ న్యూస్​. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్​సీ రెన్యువల్​, ఫిట్​నెస్​ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ జారీ చేసింది. ఇకపై, 15 ఏళ్లు పైబడిన వాహనాల ఆర్​సీ రెన్యువల్​కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక, ఆర్​సీ రెన్యువల్​ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్​లో ఆలస్యం చేస్తే, నెలకు రూ .300 నుండి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది.

ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్​నెస్ సర్టిఫికేట్ రెన్యువల్​ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ .50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజును రూ.300 నుంచి రూ .1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్​​ కోసం రూ .12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా, 2‌021 అక్టోబర్​ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన స్క్రాపేజ్​ విధానాన్ని రూపొందించే ప్రణాళికలో భాగంగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పెంపును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

పాత వాహనాల సంఖ్యను తగ్గించేందుకే..
సాధారణంగా 15 ఏళ్లు దాటిన ప్రైవేటు వాహనాల విషయంలో వాటి యజమానులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్​సీ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, వాణిజ్య వాహనాల విషయంలో, అవి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ రెన్యువల్​ తప్పనిసరి. ఫిట్​నెట్​ పరీక్షలో పాస్​ అయిన తర్వాతే ఆ వాహనానికి రెన్యువల్​ సర్టిఫికెట్​ అందజేస్తారు. అయితే, వాహనాలను స్క్రాప్​ చేయడానికి, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రిజిస్టర్డ్​ వెహికల్ స్క్రాపింగ్​ కేంద్రాల ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం, వాహన యజమాని దేశంలోని ఏ స్క్రాపింగ్​ కేంద్రానికైనా తన పాత వాహనాన్ని తీసుకెళ్లి ఉచిత సేవలు పొందవచ్చు. ఆ యజమాని తన స్క్రాపింగ్​ సర్టిఫికెట్​ను ఎవరికైనా బదిలీ చేసి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. దీని కోసం ప్రోత్సాహాలను కూడా పొందవచ్చు. పాత కాలుష్య వాహనాలను తొలగించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనలను ప్రకటించినట్లు భావించవచ్చు.
ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

కొత్త ఫీజులు ఇలా..
వ్యక్తిగత వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజు

వెహికల్​ టైప్​ రిజిస్ట్రేషన్​ ఫీజు రెన్యువల్​ ఫీజు
మోటార్​ సైకిల్​ 300 1,000
థ్రీవీలర్​ 600 2,500
కారు/జీపు 600 5,000
ఇంపోర్టెడ్​ వెహికల్​ 5,000 40,000

కమర్షియల్​ వాహనాల ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ ఫీజు

వెహికల్ టైప్ ఫిట్​నెస్​ ఫీజు రెన్యువల్ ఫీజు
మోటార్ సైకిల్ 500 1,000
థ్రీవీలర్ 1,000 3,500
ట్యాక్సీ/క్యాబ్​ 1,000 7,000
మీడియం గూడ్స్​ /ప్యాసింజర్​ 1,300 10,000
హెవీ గూడ్స్​/ప్యాసింజర్​ 1,500 12,500
ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
First published: