'బచ్పన్ కా ప్యార్' వీడియోతో సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిన సహదేవ్ డిర్డో డిసెంబర్ 28 మంగళవారం (సెప్టెంబర్ 28, 2021) ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సహదేవ్ తన తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై నుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. నేషనల్ మీడియా సమాచారం ప్రకారం సహదేవ్‌ను జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం జగదల్పూర్లోని మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహదేవ్ తలకు గాయాలు అయ్యాయని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనేందుకు సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్వార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ శర్మ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ చందేల్ జగదల్పూర్లోని న్యూరాలజిస్ట్‌తో కేసుపై చర్చించారు.
ఎలా సెలబ్రెటీ అయ్యాడు..
కమలేష్ బారోత్ అనే ప్రైవేట్ ఆల్బమ్స్ సింగర్ కమ్ ఆర్టిస్ట్ కంపోజ్ చేసిన ‘బచ్పన్ కా ప్యార్’ సాంగ్ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. ఉత్తరాదిలో రూరల్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ టైంలో ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్దో తన టీచర్ కోసం ‘బచ్(స్)పన్ క్యా ప్యార్’ అంటూ స్కూల్లో పాడాడు. అప్పటికే సహదేవ్ 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ పాట ఆ టీచర్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ పిల్లాడి గొంతుకు ఫిదా అయిపోయారు.
దాన్ని ఫోన్లో రికార్డు చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసారు. కానీ, అది వైరల్ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. సహదేవ్ డిర్దో నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పిల్లాడి పాటకు రీమిక్స్తోడై సోషల్ మీడియాని ఊపేస్తోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్ సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గొంతుకు ఫిదా అయిపోతున్నారు.
బుల్లితెర రియాలిటీ షోలు సైతం ఈ పాటను తెగ వాడేసుకుంటున్నాయి.రెండేళ్ల క్రితం పాడిన ఆ పాట వైరల్ అవ్వటం కూడా ఓ వైరల్ అనే చెప్పాలి.
సీఎం ఫిదా..
‘ జానే మేరీ జానేమన్.. బస్‌పన్ క్యా ప్యార్ మేరా..’ అంటూ ఛత్తీస్ గడ్ పిల్లాడు పాడిన పాటకు సీఎం కూడా ఫిదా అయిపోయాడు. స్వయంగా పిలిపించుకుని ఘనంగా సన్మానించారు సీఎం భూపేష్ బాఘేల్.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.