కేజ్రీ ప్రమాణస్వీకారానికి రండి..ప్రత్యేక అతిథికి ఆప్ ఆహ్వానం

Kejriwal Swearing-in | ఈ నెల 16న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అర్వింద్ కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు ఎవరినీ ఆహ్వానించకూడదని ఆప్ నిర్ణయించుకుంది.

news18-telugu
Updated: February 13, 2020, 7:32 PM IST
కేజ్రీ ప్రమాణస్వీకారానికి రండి..ప్రత్యేక అతిథికి ఆప్ ఆహ్వానం
బేబీ కేజ్రీవాల్
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన తర్వాత కేజ్రీవాల్ గెటప్‌లో ఉన్న ఓ బుడతడి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం తెలిసిందే.  మఫ్లర్‌లో అచ్చం కేజ్రీవాల్ గెటప్‌లో ఉన్న ఈ బుడతడి ఫోటోను ఆప్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘బేబీ కేజ్రీవాల్’ ఫోటోను నెటిజన్లు తెగ షేర్ చేశారు. ఫలితాలు వెలువడిన రోజున కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయంపై సోషల్ మీడియాలో ఎంతగా చర్చ జరిగిందే...‘బేబీ కేజ్రీవాల్’ గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది. రెండ్రోజుల తర్వాత ఈ లిటిల్ కేజ్రీవాల్‌ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ నెల 16న రాంలీలా మైదానంలో జరగనున్న కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని లిటిల్ కేజ్రీవాల్‌ను ఆప్ ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఆప్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాల్లో ఆప్ గెలుచుకోగా...బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో విజయంసాధించారు. కాంగ్రెస్ 2015 ఎన్నికల్లోలానే..ఈ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేకపోయింది. ఈ నెల 16న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అర్వింద్ కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు ఎవరినీ ఆహ్వానించకూడదని ఆప్ నిర్ణయించుకుంది.ఢిల్లీ ప్రజలను మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తామని, ఇతర పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు ఎవరినీ ఆహ్వానించడం లేదని ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు. అయితే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది.
First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు