హోమ్ /వార్తలు /జాతీయం /

వాగులో మునిగిపోతున్న మనిషి... కాపాడి ఒడ్డుకు చేర్చిన ఏనుగు

వాగులో మునిగిపోతున్న మనిషి... కాపాడి ఒడ్డుకు చేర్చిన ఏనుగు

వాగులో మునిగిపోతున్న మనిషి... కాపాడి ఒడ్డుకు చేర్చని ఏనుగు

వాగులో మునిగిపోతున్న మనిషి... కాపాడి ఒడ్డుకు చేర్చని ఏనుగు

అందులో ఓ పిల్ల ఏనుగు వాగులో వ్యక్తి మునిగిపోతున్నాడని భావించింది. వెంటనే నీటిలోకి దిగి అతగ్ని కాపాడేందుకు ప్రయత్నించింది.

  జంతువులకు మనుషుల కంటే మానవత్వం ఎక్కువని నిరూపించింది తాజాగా చోటు చేసుకున్న ఘటన. ఎప్పుడూ ఏనుగుల పంటలపై పడి నాశనం చేశాయి, ఊళ్లపై దాడులు చేసి ఇళ్లన్నీ గుల్ల చేశాయన్న వార్తలే ఇప్పటివరకు మనం విన్నాం. కానీ ఏనుగులకు కూడా మనసు, మానవత్వం ఉంటాయని చాటి చెప్పింది ఓ ఘటన. వాగులో మునిగిపోతున్న ఓ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చింది ఏనుగు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఈ వీడియో వైరల్‌గా మారింది.

  ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో చూస్తే... ఒక వ్యక్తి వాగులో సరదాగా ఈత కొడుతున్నాడు. అయితే అటు ఒడ్డున ఓ ఏనుగుల గుంపు కూడా ఉంది. అందులో ఓ పిల్ల ఏనుగు వాగులో వ్యక్తి మునిగిపోతున్నాడని భావించింది. వెంటనే నీటిలోకి దిగి అతగ్ని కాపాడేందుకు ప్రయత్నించింది. అయితే సదరు వ్యక్తి ఏనుగు తనపై దాడి చేస్తుందేమోనని ముందుగా భయపడ్డాడు. ఆ తర్వాత అది తన తొండం సాయంతో అతడ్ని ఒడ్డుకు లాక్కెళ్లడం చూసి... ఆశ్చర్యపోయాడు.

  తన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఆ ఏనుగుకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో బేబి ఎలిఫేంట్ ట్రెండ్ సెట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లంతా ఏనుగులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏనుగులు చాలా దయాగుణం కలిగి ఉంటాయంటున్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Elephant, Twitter, VIRAL NEWS, Viral tweet, Viral video

  ఉత్తమ కథలు