అయ్యో పాపం.. ఉయ్యాలలో నుంచి కిందపడి చిన్నారి మృతి.. అసలు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి కిందపడి మృతిచెందింది.

  • Share this:
    ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి కిందపడి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. ఎం జీవికా అనే రెండు నెలల చిన్నారిని ఆమె తల్లి చిన్న పిల్లలు ఉయ్యాలలో వేసింది. అది మూడు ఫీట్ల ఎత్తులో ఉంది. అయితే కొద్దిసేపటికే ఆ చిన్నారి.. ఉయ్యాల నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చిన్నారిని Government Rajaji Hospitalకు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు.

    అయితే రాజాజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. చిన్నారి బుధవారం మరణించింది. ఈ ఘటనకు సంబంధించి చిన్నారి తండ్రి ముత్తు రామలింగం ఎలుమాలై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చిన్నారి తండ్రి ముత్తు రామలింగం కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ముత్తు రామలింగం దంపతులకు ఈ చిన్నారి తొలి సంతానం అని చెప్పారు. ఆడ శిశువు కావడంతో హత్య జరిగిందనడాని అవకాశాలు తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పారు. చిన్నారి పోస్ట్‌మార్టమ్ నివేదిక కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. ఇక, గతేడాది కాలంలో ఉసిలంపట్టి ప్రాంతంలో ఆడశిశువులను హత్య చేసిన పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: