షాకింగ్.. తల్లికి కరోనా నెగిటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్..

మహిళకు జూన్ 25న మరోసారి పరీక్ష చేయగా మళ్లీ పాజిటివ్‌గా తేలింది. దాంతో మరికొన్ని రోజుల చికిత్స తర్వాత జూలై 7న మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, కరోనా నెగిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: July 12, 2020, 6:29 AM IST
షాకింగ్.. తల్లికి కరోనా నెగిటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంటిలో ఒక్కరికి వస్తే.. వారి నుంచి కుటుంబ సభ్యులకు సోకుతుంది. కానీ ఓ మహిళకు కరోనా నెగిటివ్ రాగా, ఆ మరుసటి రోజే పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇది విన్న వైద్యులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ(25) గర్భిణీ. జూన్ 11వ తేదీన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనా వైరస్‌తో చేరింది. ఆమె నుంచి భర్తకు కూడా సోకడంతో అతడు సైతం అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళకు జూన్ 25న మరోసారి పరీక్ష చేయగా మళ్లీ పాజిటివ్‌గా తేలింది. దాంతో మరికొన్ని రోజుల చికిత్స తర్వాత జూలై 7న మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, కరోనా నెగిటివ్ వచ్చింది.

ఆ మరుసటి రోజే ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఆ మహిళకు పండంటి బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినఆరు గంటల తర్వాత వైద్యులు కరోనా నిర్ధారణ కోసం శాంపిల్ సేకరించారు. ఆ శాంపిల్‌లో బిడ్డకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తల్లికి కరోనా వైరస్ నెగిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాతే బిడ్డకు జన్మనిచ్చింది. అయినా బిడ్డకు పాజిటివ్ ఏలా వచ్చిందనే విషయంలో వైద్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే పిల్లలకు బొడ్డు తాడు ద్వారా కరోనా సోకుతుందని చైనాలో జరిపిన పరిశోధనలో తేలింది.కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 6:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading