బీజేపీకి భారీ షాక్.. టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ

టీఎంసీలో చేరిన బాబుల్ సుప్రియో (Image: TMC/Twitter)

Babul Supriyo joins TMC | పశ్చిమబెంగాల్లో బీజేపీ ఓటమి తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు, నేతలు మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో (Babul Supriyo) కూడా టీఎంసీ గూటికి చేరడంతో బెంగాల్లో బీజేపీకి షాక్‌ తగిలినట్టయింది.

 • Share this:
  పశ్చిమ బెంగాల్లో (West Bengal) భారతీయ జనతా పార్టీకి (BJP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన బాబుల్ సుప్రియో  (Babul Supriyo quits BJP) బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో (Trinamool Congress) చేరారు. టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ (Derek O'brien) సమక్షంలో ఆయన తృణమూల్ కండువా కప్పుకొన్నారు. బాబుల్ సుప్రియో మొన్నటి వరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) మంత్రివర్గంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘోర పరాజయం తర్వాత జరిగిన కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బాబుల్ సుప్రియోను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత నుంచి బాబుల్ సుప్రియో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఓ సారి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్టు ట్వీట్ చేశారు. కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తాను ఎంపీగా కొనసాగుతానని ప్రకటించారు. అయితే, ఇది జరిగిన కొన్ని రోజులకే బాబుల్ సుప్రియో అధికార టీఎంసీలో చేరారు.

  రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించి, ఇప్పుడు పార్టీ మారడంపై స్పందించారు బాబుల్ సుప్రియో. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించినప్పుడు నేను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పా. ఇప్పుడు టీఎంసీలో చేరడం ద్వారా ప్రజలకు సేవచేసేందుకు మరింత అవకాశం లభిస్తుంది. రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నప్పుడు నా అభిప్రాయం తప్పని, కేవలం ఎమోషనల్ అని నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు చెప్పారు.’ అని బాబుల్ సుప్రియో చెప్పారు.  బాబుల్ సుప్రియో ఓ నటుడు, సింగర్. పలు టీవీ షోల్లో కూడా నటించారు. పశ్చిమ బెంగాల్లో పేరున్న యాక్టర్. అసన్ సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2014, 2019లో రెండుసార్లు పోటీచేసి విజయం సాధించారు.

  బాబుల్ సుప్రియో తమ పార్టీలో చేరినట్టు టీఎంసీ ట్వీట్  నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా విధులు నిర్వర్తించారు. 2019లో రెండోసారి గెలిచిన తర్వాత పర్యావరణ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 2021 జూలైలో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయన మంత్రి పదవి పోయింది.

  Also Read This: సోనూసూద్ ట్యాక్స్ ఎగవేశాడు.. ఐటీ శాఖ ప్రకటన


  ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ జంప్

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కమలం పార్టీ నుంచి టీఎంసీలోకి వలసలు పెరిగాయి. ఎన్నికలకు ముందు మమతా బెనర్జీకి షాక్ ఇచ్చి కమలం పార్టీలో చేరిన చాలా మంది నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకోవడం స్టార్ట్ చేశారు. ఇక బీజేపీ టికెట్ మీద గెలిచిన వారు కూడా టీఎంసీలో చేరుతున్నారు. ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బీజేపీ నుంచి గెలిచిన ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ నియోజవకర్గాలు ఉన్నాయి. 2021 మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 213 సీట్లు వచ్చాయి. టీఎంసీకి గట్టి పోటీ ఇస్తుందని, మమతా బెనర్జీ పదేళ్ల పాలనకు ముగింపు పలుకుదామని భావించిన బీజేపీ కేవలం 77 సీట్లు సాధించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: