news18-telugu
Updated: October 14, 2020, 7:55 AM IST
Baba Ramdev: ఏనుగుపై యోగా చేస్తూ... జారిపడిన రాందేవ్ బాబా... (credit - twitter)
Baba Ramdev: యోగా గురువైన రాందేవ్ బాబా... మధురా... మహావనంలోని రామ్ నరేథీ ఆశ్రమంలోని ఏనుగుపై ఎక్కి యోగాసనాలు ప్రారంభించారు. ఎప్పుడూ స్టేజీపై యోగాసనాలు చేసే రాందేవ్ బాబా... ఇప్పుడు ఓ ఏనుగు ఎక్కడంతో... అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆయన ఏనుగుపై ఎలా యోగాసనాలు చేస్తారు... అది ఎలా వీలవుతుంది... అని చాలా మంది ఆశ్చర్యంగా చూడసాగారు. కొంతమంది తమ మొబైళ్లతో ఆ యోగాసనాలను వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంతలో రాం దేవ్ బాబా అటూ ఇటూ కదులుతుంటే... ఆ ఏనుగు కంగరు పడింది... చుట్టూ ప్రజలు పోగవడంతో... ఏదో అయిపోతోందని ఏనుగు అనుకుంది. ఒక్కసారిగా కదిలింది. అంతే... బాబా రాందేవ్... ఏనుగుపై నుంచి యోగా చేస్తూ... జారి కింద పడ్డారు.
ఈ ఘటనలో రాందేవ్ బాబాకు అంతగా గాయాలేవీ కాలేదు. ఎప్పుడైతే ఏనుగు కదిలిందో ఆయన అలర్ట్ అయ్యారు. కింద పడుతూనే జాగ్రత్తగా పడ్డారు. అందువల్ల ఆయనకు ఏం కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..
అసలు ఈ ఆశ్రమానికి రాందేవ్ వెళ్లడానికి ఓ కారణం ఉంది. అక్కడి రుషులక ఆయన యోగా ప్రాక్టీస్ అలవాటు చేద్దామనుకున్నారు. తీరా చూస్తే ఇలా అయ్యింది.
మీకు తెలిసే ఉంటుంది. ఆగస్టులో కూడా ఇలాగే ఓ ఘటనలో రాందేవ్ బాబా పడిపోయారు. ఓ సైకిల్ పై వెళ్తూ... నీరు ఉన్న రోడ్డుపై జారి పడ్డారు. అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్ అయ్యంది. అది ఇదే.
యోగాసనాలకు బాబా రాందేవ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. చాలా దేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. 2002 నుంచి ఆయన టీవీ ఆడియన్స్కి యోగా క్లాసులు చెబుతున్నారు. యోగా వల్ల శరీరం ఫిట్ అవుతుంది. మానసికంగా కూడా మేలు జరుగుతుంది. అందుకే యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యోగాలోని ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియ... కండరాలను బలంగా చేసి... ఒత్తిడిని తగ్గిస్తుంది.
Published by:
Krishna Kumar N
First published:
October 14, 2020, 7:55 AM IST