Home /News /national /

BABA KA DHABA OWNER KANTA PRASAD DISCHARGED AFTER SUICIDE ATTEMPT SAYS YOUTUBERS FORCED HIM INTO DEPRESSION SK

Baba Ka Dhaba: ఆస్పత్రి నుంచి బాబా కా దాబా ఓనర్ డిశ్చార్జి.. ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఇవే

కాంతా ప్రసాద్

కాంతా ప్రసాద్

యూట్యూబర్ గౌరవ్ వాసన్‌కు క్షమాపణ చెప్పాలంటూ.. కొంతమంది యూట్యూబర్‌‌లు తనకు కాల్ చేసి ఒత్తిడి తెస్తున్నారని వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆయన చెప్పారు.

    'బాబా కా దాబా' (Baba ka dhaba) ఓనర్ కాంతా ప్రసాద్ (Kanta Prasad) కోలుకున్నారు. ఢిల్లీ సఫ్దార్‌జంగ్ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడడంతో గురువారం ఇంటికి చేరుకున్నారు. అనంతరం తాను ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు గల కారణాలను పోలీసులకు వివరించారు. యూట్యూబర్ గౌరవ్ వాసన్‌కు క్షమాపణ చెప్పాలంటూ.. కొంతమంది యూట్యూబర్‌‌లు తనకు కాల్ చేసి ఒత్తిడి తెస్తున్నారని వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆయన చెప్పారు. ఐతే పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. కాంతా ప్రసాద్‌కు కాల్ చేసిన యూట్యూబర్ల వివరాలను సేకరిస్తున్నారు. బాబా కా దాబా ఓనర్ కాంతా ప్రసాద్ జూన్ 18న ఆత్మహత్యాయత్నం చేసి విషయం తెలిసిందే. మద్యంలో నిద్రమాత్రలు కలుపుకొని తాగి, ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారం రోజుల చికిత్స అనంతరం కాంతా ప్రసాద్ కోలుకున్నారు.

    గత ఏడాది కాంతా ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఢిల్లీ మాళవీయనగర్‌లో రోడ్డుపక్కన ఓ చిన్న కొట్టు నడుపుకుంటూ జీవనం సాగించే కాంతా ప్రసాద్.. ఓ యూబ్యూట్ వీడియోతో చాలా ఫేమస్ అయ్యారు. గిరాకీ లేక, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కాంతా ప్రసాద్‌ను గౌరవ్ వాసన్ అనే యూట్యూబర్ వీడియో తీశాడు. కాంతా ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన కష్టాన్ని చూసి ఎంతో మంది చలించిపోయారు. ఆ చిన్న కొట్టుకు వద్దకు వెళ్లి భోజనం చేశారు. మరికొందరు ఆర్థిక సాయం చేశారు. కాంతా ప్రసాద్‌కు సాయం చేసేందుకు, యూట్యూబర్ గౌరవ్ వాసన్ విరాళాలు సేకరించి ఆయనకు అందజేశారు. ఐతే తన పేరుతో డబ్బులు వసూలు చేసి.. మోసం చేశాడని గౌరవ్ వాసన్‌పై కేసుపెట్టారు కాంతా ప్రసాద్.

    యూట్యూబర్‌పై కేసుపెట్టడంతో కాంతా ప్రసాద్‌పై విమర్శలు వచ్చాయి. నీకు మేలు చేసిన వాడికే కీడు చేస్తావా అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఐతే కాంతా ప్రసాద్‌కు అప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు అందడంతో.. దానితో ఓ హోటల్ కూడా పెట్టారు. కానీ కరోనా సమయంలో గిరాకీ లేక తీవ్రంగా నష్టం వచ్చింది. చివరకు మళ్లీ చిన్నకొట్టు వద్దకే వచ్చి.. వ్యాపారం కొనసాగించారు. అప్పుడు కాంతా ప్రసాద్‌ను చూసి పలువురు నెటిజన్లు సెటైర్లు వేశారు. కర్మ ఎవ్వరినీ వదలిపెట్టదు.. ఎక్కడ మొదలయ్యావో.. మళ్లీ అక్కడికే వచ్చావుగా.. అంటూ విమర్శలు గుప్పించారు.

    ఇటీవల మరో వ్యక్తి కాంతా ప్రసాద్‌పై వీడియో తీశారు. ఆ వీడియో ద్వారా తనకు హెల్ప్ చేసిన గౌరవ్ వాసన్‌కు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆయన చాలా మంచి వారని.. మోసగాడు కాదని అన్నారు. తాను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఆ పెద్దాయన విజ్ఞప్తి చేశారు. తనను ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరారు. కానీ అంతలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు కాంతా ప్రసాద్. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం.. ఫోన్‌చేసి తిట్టడం వల్లే.. మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారని చాలా మంది నెటిజన్లు ఆ రోజే అభిప్రాయపడ్డారు. దయచేసి కాంతా ప్రసాద్‌‌ను వదిలేయండని.. ఆయన బతుకు ఆయన బతకుతున్నాడని విజ్ఞప్తి చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Delhi, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు