Home /News /national /

BABA HYDRAMA IN MADHYA PRADESH HOSPITAL SCENES OF ATTACK ON STAFF AND POLICE ARE VIDEO VIRAL SNR

ఆసుపత్రిలో బాబా హల్‌చల్..అడ్డొచ్చిన వాళ్లను రఫ్పాడించిన వృద్ధుడు

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Mental baba: మధ్యప్రదేశ్‌ ఛత్తర్‌పూర్‌ జిల్లా ఆసుపత్రిలో ఓ బాబా వీరంగం సృష్టించాడు. పిచ్చ చేష్టలు, సిబ్బంది దాడి, ఆసుపత్రి ఫర్నీచర్‌ని ధ్వంసం చేసి పెద్ద హైడ్రామా క్రియేట్ చేశాడు. విసిగిపోయి పోలీసులకు అప్పగిస్తే పోలీస్ స్టేషన్‌లో కూడా అవే వేషాలు వేశాడు.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ ఆసుపత్రిలో అతడు చేసిన యాగీ అంతా ఇంత కాదు. పేషెంట్‌ కాదో తెలియదు గానీ ఆసుపత్రి సిబ్బందిని, ట్రీట్‌మెంట్ పొందుతున్న రోగుల్ని చివరకు ఆసుపత్రి ఆవరణలో ఉన్న వాళ్లు కూడా అతని ప్రవర్తన చూసి భయపడి పరుగులు పెట్టేలా చేశాడు. ఒంటిపై కాషాయం రంగు పంచె, మెడలో ఓ దండ వేసుకొని షర్ట్‌ కూడా లేకుండానే ఆసుపత్రికి వచ్చి రచ్చ రచ్చ చేశాడు. మధ్యప్రదేశ్( Madhya Pradesh)చతర్పూర్‌ (Chattarpur)జిల్లా ప్రభుత్వాసుపత్రి(Government hospital)లో ఈ తతంగం అంతా జరిగింది. సుమారు 60సంవత్సరాలు (60 Years old man)కలిగిన ఓ వ్యక్తి ఆసుపత్రికి వచ్చి హైడ్రామా సృష్టించాడు. వార్డులోకి ఎంటరైన వృద్ధుడు ఏవేవో  మాట్లాడుతూ వార్డులోని బెడ్స్(Beds), స్ట్రెచర్‌ (Stretcher), వీల్‌చైర్ల (Wheelchair)ను పడేశాడు. అంతటితో ఆగకుండా ఆసుపత్రి ఆవరణలోని నేలపై పడుకోవడం, వార్డుల్లో దొర్లడం వంటి పిచ్చి చేష్టలు చేశాడు. బాబా వేషంలో ఉన్న వృద్ధుడు చేస్తున్న న్యూసెన్స్‌ తట్టుకోలేకపోయిన ఆసుపత్రి సిబ్బంది (Hospital staff)అతడ్ని పట్టుకొని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వాళ్లను ఏమాత్రం లెక్క చేయకుండా అదే రభస కొనసాగించాడు. చూస్తున్న వాళ్లకే కాదు చివరకు ట్రీట్‌మెంట్‌ (Treatment)చేసేందుకు ముందుకొచ్చిన ఆసుపత్రి వైద్యులను కూడా తోసేయడం, వారిపై దాడి చేయడంతో అంతా విసిగిపోయి అతను రోగి కాదని..ఏదో హైడ్రామా సృష్టించడానికి వచ్చినట్లుగా భావించారు. వెంటనే ఆసుపత్రి సెక్యురిటీని పిలిపించారు. అతడ్ని బయటకు తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రి సెక్యురిటీపై కూడా తిరగబడ్వాడాడు. సెక్యురిటీ వాళ్లను కాళ్లతో తన్నడం, వేలెత్తి చూపిస్తూ బెదిరించడం వంటి పిచ్చి చేష్టలు చేశాడు.

ఆసుపత్రిలో గంటసేపు హైడ్రామా..
జిల్లా ఆసుపత్రికి ఓ రోగిలా వచ్చిన బాబా వేషంలో ఉన్న వృద్దుడు న వీరంగం సృష్టించాడు. విసిగిపోయిన సిబ్బంది అతడ్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అసలు అతను ఎవరూ ? ఏం పేరు ? అతని సమస్య ఏంటో తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి పిలిపించారు వాళ్లు రాగానే అప్పగించారు.

బాబా వేషంలో ఉన్న రోగి ..
బాబా గెటప్‌లో ఉన్న వృద్ధుడు ఆసుపత్రి నుంచి వెళ్లేటప్పుడు కూడా ఉద్యోగుల్ని తన్నడం, తిట్టడం చేశాడు. అతి బలవంతం మీద అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడ కూడా బాబా పిచ్చి వేషాలు వేయడం మానలేదు.స్టేషన్‌లో ఆసనాలు వేయడం అక్కడున్న సిబ్బందిని విసిగించే విధంగా ఏవేవో మాట్లాడటంతో అతడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు గుర్తించారు. బాబాగా వచ్చిన వ్యక్తి మానసీక రోగిగా గుర్తించారు.  ఓ మెంటల్‌ పేషెంట్  గంట సేవు అటు ఆసుపత్రి సిబ్బందిని, ఇటు పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Hospitals, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు