ఆజంఖాన్ కాలేజీలో అమ్మాయిని వేధించాడు....సంచలన విషయాలు పేల్చిన మతగురువు...

1975లో ఆజంఖాన్ అలీగడ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పీజీ చదివే రోజుల్లో ఓ ఆసుపత్రిలోని మహిళా వార్డులోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాడని, ఈ ఘటననను సీరియస్ గా పరిగణించిన యూనివర్సిటీ యాజమాన్యం ఆజంను దోషిగా తేల్చడంతో, ఆయన ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యాడు.

news18-telugu
Updated: August 9, 2019, 4:09 PM IST
ఆజంఖాన్ కాలేజీలో అమ్మాయిని వేధించాడు....సంచలన విషయాలు పేల్చిన మతగురువు...
ఆజం ఖాన్ (ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: August 9, 2019, 4:09 PM IST
వివాదాస్పద రాజకీయ నేత, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, ఎంపీ ఆజంఖాన్ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని వేధించి అలీగఢ్ యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యాడని ప్రముఖ షియా మతగురువు మౌలానా కల్బే జవ్వాద్ సంచలన విషయాలు తెలపాడు. 1975లో ఆజంఖాన్ అలీగడ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పీజీ చదివే రోజుల్లో ఓ ఆసుపత్రిలోని మహిళా వార్డులోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాడని, ఈ ఘటననను సీరియస్ గా పరిగణించిన యూనివర్సిటీ యాజమాన్యం ఆజంను దోషిగా తేల్చడంతో, ఆయన ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యాడు. అయితే అదే సంవత్సరం దేశంలో ఎమర్జన్సీ విధించిన నేపథ్యంలో ఆజంఖాన్ ఏడాది పాటు జైలుకు వెళ్లినట్లు మౌలానా తెలిపారు. ఇదిలా ఉంటే ఆజం ఖాన్ తాజాగా పార్లమెంటులో సైతం మహిళా ఎంపీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...