హోమ్ /వార్తలు /జాతీయం /

మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...

మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...

అజం ఖాన్ (File)

అజం ఖాన్ (File)

Lok Sabha Election 2019 : ఎన్నికలు వచ్చినప్పుడల్లా... కొందరు నేతలు నోరు పారేసుకుంటూ ఉంటారు. ఈసారి ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న అజంఖాన్... మరో వివాదంలో చిక్కుకున్నారు.

  ఉత్తరప్రదేశ్... రాంపూర్ నుంచీ సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసిన అజంఖాన్... ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తూ... వివాదాలకు కారణమవుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రత్యర్థి జయప్రదపై ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వేడి చల్లారక ముందే అజంఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజల ముందు కెమెరాలకు పోజ్ ఇస్తూ... జిల్లా మేజిస్ట్రేట్‌ని చూసి భయపడాల్సిన పనిలేదన్న అజంఖాన్... తానే స్వయంగా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్‌ని తీసుకెళ్లి... మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తానన్నారు. ఓ జిల్లా కలెక్టర్‌పై ఆ స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ఆశ్చర్యపోవడం అక్కడి ప్రజల వంతైంది.


  కలెక్టర్‌ని చూసి భయపడకండి. ఈ అధికారులు మాయావతి షూస్ పాలిష్ చేస్తూ ఉండే ఫొటోలను మీరు ఎప్పుడైనా చూశారా. నేను మరోసారి వాళ్లతో ఆమె షూని పాలిష్ చేయిస్తాను
  పబ్లిక్ ర్యాలీలో అజంఖాన్


  రాంపూర్ నుంచీ బీజేపీ తరపున పోటీచేస్తున్న జయప్రద... ఖాకీ అండర్‌వేర్ వేసుకున్నారనే కామెంట్ చేసి దేశవ్యాప్తంగా ప్రజల విమర్శలు ఎదుర్కొంటున్నారు అజంఖాన్. మంగళవారం ఉదయం 10 గంటల నుంచీ మూడ్రోజుల పాటూ ఆయన ఎన్నికల ప్రచారం చెయ్యకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.


   


  ఇవి కూడా చదవండి :

  సుమలత ఫేస్‌బుక్ అకౌంట్ బ్లాక్ చేశారట... ఆమె ఏం చేశారంటే...


  వారణాసి నుంచీ బరిలో ప్రియాంక గాంధీ... నరేంద్ర మోదీని ఓడించబోతున్నారా...


  పెళ్లైన 20 ఏళ్ల తర్వాత పుట్టిన పాప... నోట్ల వర్షం కురిపించిన బిజినెస్ ఫ్యామిలీ...

  First published:

  Tags: Azam Khan, Azamgarh S24p69, Jaya Prada, Samajwadi Party, Uttar Pradesh Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు