కాశ్మీర్ యాపిల్స్‌పై భారత్ వ్యతిరేక నినాదాలు

ఈ ఘటనను కశ్మీర్ పండ్ల వ్యాపారులు తీవ్రంగా ఖండించారు. కథువా పండ్ల మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 17, 2019, 5:09 PM IST
కాశ్మీర్ యాపిల్స్‌పై భారత్ వ్యతిరేక నినాదాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పోస్ట్ పెయిడ్ టెలికాం సేవలు తిరిగి ప్రారంభమయ్యాక.. లోయలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్లు, పండ్ల వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో కొందరు వేర్పాటువాదులు సైతం చెలరేగిపోతున్నారు. కాశ్మీర్ యాపిల్స్‌పై భారత వ్యతిరేక నినాదాలను రాస్తూ రెచ్చగొడుతున్నారు. కథువా జిల్లాలో యాపిల్ పండ్లపై పెద్ద ఎత్తున నినాదాలు కనిపించడంతో పండ్ల వ్యాపారులు షాకయ్యారు. బాక్సులను ఓపెన్ చేసి చూస్తే.. 'ఐ లవ్ బుర్హాన్ వనీ', 'మాకు స్వాతంత్ర్యం కావాలి' అనే సందేశాలు యాపిల్స్‌పై కనిపించాయి.

ఈ ఘటనను కశ్మీర్ పండ్ల వ్యాపారులు తీవ్రంగా ఖండించారు. కథువా పండ్ల మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. పాకిస్తాన్, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. లేదంటే కాశ్మీర్ రైతుల నుంచి యాపిల్స్ కొనుగోలు చేయబోమని హెచ్చరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పండ్ల వ్యాపారులను కలిసి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
First published: October 17, 2019, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading