హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

దేశంలో మహిళలు ఎక్కువగా తాగుతున్న రాష్ట్రాలు తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

దేశంలో మహిళలు ఎక్కువగా తాగుతున్న రాష్ట్రాలు తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యం తాగే మహిళల సంఖ్య తగ్గుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పురుషుల సంఖ్య కూడా తగ్గుతున్నట్లు నిర్ధారించాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు మద్యం() తాగే మహిళలు (Liquor Consumption Among Women), పురుషుల ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

ఇంకా చదవండి ...

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యం( Alcohol ) తాగే మహిళల సంఖ్య తగ్గుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పురుషుల సంఖ్య కూడా తగ్గుతున్నట్లు నిర్ధారించాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు మద్యం తాగే మహిళలు (Liquor Consumption Among Women), పురుషుల ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-National Family Health Survey) 2019-21 ప్రకారం.. కేరళలో 15-49 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో మద్యం తాగే వారి శాతం గణనీయంగా తగ్గింది. సర్వే(Survey) ప్రకారం, రాష్ట్రంలోని మహిళల్లో మద్యం తాగే వారి సంఖ్య 2015-16లోని సర్వే వివరాలతో పోలిస్తే 1.6 శాతం నుంచి 0.3 శాతానికి పడిపోయింది. జాతీయ స్థాయిలో మద్యపానం చేసే మహిళల నిష్పత్తి మారకపోయినప్పటికీ కేరళలో పురోగతి కనిపిస్తోంది.

జాతీయ స్థాయిలో.. 22.4 శాతం మంది పురుషులతో పోలిస్తే 0.7 శాతం మంది మహిళలు మాత్రమే మద్యం తాగుతున్నారు. పురుషుల ఆల్కహాల్ ఇండెక్స్‌లో కేరళ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. NFHS 2015-16లో 37 శాతం మంది పురుషులు మద్యం తాగుతుండగా ప్రస్తుత సర్వేలో ఆ సంఖ్య 26 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి:  147 years of BSE: మర్రి చెట్టుకింద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్ర చదివితే మీరే ఆశ్చర్యపోతారు..!


దేశంలోని ఇతర రాష్ట్రాలలో.. మద్యం తాగే మహిళల్లో అరుణాచల్ ప్రదేశ్ 17.8 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, సిక్కిం 14.8 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాదిలో తెలంగాణ, అండమాన్, నికోబార్ దీవులు వరుసగా మహిళలు, పురుషుల ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. పురుషులు 24వ స్థానంలో నిలవగా, మహిళల మద్యపానం విషయంలో దేశంలో కేరళ 21వ స్థానంలో ఉంది. కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (బెవ్‌కో) విక్రయాల గణాంకాలు కూడా కేరళ ఆలోచనా విధానంలో మార్పును నొక్కి చెబుతున్నాయి. 2011-16 మధ్య కాలంలో విదేశీ మద్యం అమ్మకాల పరిమాణంతో పోలిస్తే, 2016-21 మధ్య కాలంలో అమ్మకాలలో 112.51 లక్షల కేసులు తగ్గాయి.

తిరువనంతపురంలో డి-అడిక్షన్ చికిత్స, పునరావాసంలో సుదీర్ఘ అనుభవం ఉన్న డేల్ వ్యూ అనే స్వచ్ఛంద సంస్థ కౌన్సెలర్, డైరెక్టర్ డిబిన్ దాస్ మాట్లాడుతూ.. ‘కేరళలో ఆల్కహాల్ వ్యసనంలో గణనీయమైన మెరుగుదల ఉందని నేను అనుకోను. గత ఆర్థిక సంవత్సరం మద్యానికి బానిసలైన 15 మంది మహిళలకు పునరావాసం కల్పించాం. ఐదేళ్ల క్రితం వారి సంఖ్య ఒకటి లేదా రెండుగా మాత్రమే ఉండేది. ప్రస్తుతం 22 మంది విద్యార్థులు మా కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఎక్కువ మంది మద్యంతో పాటు సింథటిక్ డ్రగ్స్‌కు బానిసలుగా మారారు. కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రిలో పడకలను ఇప్పుడు 15 నుంచి 80కి పెంచాం. గతంలో మద్యపానం, వ్యసనాలను సమాజంలో తక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు అది దాదాపు కనుమరుగైంది. కాబట్టి, గణాంకాల ప్రకారం ఆల్కహాల్ వినియోగంలో ఏదైనా తగ్గుదల ఉంటే, మరోవైపు సింథటిక్ మాదకద్రవ్యాల దుర్వినియోగంలో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉంటుంది.’ అని చెప్పారు. అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మాత్రం.. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగైనట్లు చూపించడం లేదు.

First published:

Tags: Alcohol, Liquor ban, Survey, White alcohol

ఉత్తమ కథలు